వ్యవసాయంలో దేశం ఎంతో పురోగమించింది అన్నది తిరుగులేని వాస్తవం. మరి మన
రైతులెందుకు చితికిపోతున్నారు..? అన్ని వర్గాల ప్రజలు జీవితంలో ఎంతో కొంత
ప్రగతి సాధిస్తే., రైతుల పరిస్థితే ఎందుకని దిగజారుతోంది.. ? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక పోతున్నాయి. రైతు శ్రేయం కాపాడే విషయంలో చేతకానివిగా మిగిలిపోతున్నాయి.
రైతుకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ప్రభుత్వాలకు తెలిసినా అవి అందించే విషయంలో
ఆడ్డుపడుతున్న శక్తులను నియంత్రించలేని తీరు వల్ల అన్నదాతలు సేద్యంలో
చితికిపోతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ
వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే.., హెక్టారు సగటు ఉత్పాదకతలో
ఆశించిన పురోగతి లేక రైతుకు మిగులుబాటు ఉండటం లేదు. కాయకష్టం చేసి సిరులు
పండిస్తున్నా రైతుల పరిస్థితి దయనీయంగా ఉండటానికి దారితీస్తున్న కారణాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Tuesday, 12 February 2013
Sunday, 13 January 2013
పొలంలో పండాలి క్రాంతి
సంక్రాంతి రైతుల పండగ. ధాన్యపు రాశులు ఇంటికి చేరే సమయం కాబట్టే ఇది రైతుల పండగయ్యింది. సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో, రైతుల ముంగిళ్ళలో కనిపించే ఆ శోభ అనిర్వచనీయం. దురదృష్టవశాత్తూ రైతుల కళ్ళల్లో పండగ నాటి ఆనందం నేడు కనిపించడం లేదు. చేతి నిండా నాలుగు డబ్బులుండే పరిస్థితుల నుండి మన రైతులు పంట ఇంటికి చేరకుండానే కల్లంలోనే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వాల చేయూత లేక చితికిన రైతుల్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో అన్నదాతలు సంక్రాంతి ఆనందాలకు దూరమవుతున్నారు. ఈ పరిస్థితులను విశ్లేసిస్తూ నేను రాసిన వ్యాసాన్ని నేటి సంక్రాంతి రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేశాను.
సంక్రాంతి శుభాకాంక్షలు
బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పల్లె ఆకు పచ్చని చీర కట్టుకుని పరవశించే పండగ వేళ సొంతూర్లో ఉంటె ఆ ఆనందమే వేరు. మాది గుంటూరు జిల్లా వేమూరు. కోనసీమ పల్లె అందాలను పుణికి పుచ్చుకున్నట్టు ఎటు చూసినా పచ్చదనంతో, కొబ్బరిచెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది మా వూరు. గతేడాది వెళ్ళలేకపోయినా ఈసారి సంక్రాంతికి వూళ్ళో ఉండాలని గట్టిగా తీర్మానించుకుని వచ్చేశాను. వీలు చిక్కినప్పుడల్లా వూరుకు చెక్కేయడం చెప్పలేని ఆనందం. ఎవరికైనా సొంతూరి గాలి, నీరు, నేల... అసలక్కడి గాలి ఒక్కసారి పీల్చితే చాలు కొన్నాళ్ళకు సరిపడా శక్తిని సమకూర్చుకోవచ్చు. ఇలా చెబుతుంటే గుర్తొచ్చింది... మిత్రుడు గజల్ శ్రీనివాస్ సంక్రాంతి రోజు ఉదయం 9.30 గంటలకు ఈటీవీ-2 లో ఓ మంచి పాట పాడారు. ఒక్కసారి పల్లెకు వెళ్లి రావాలని చెబుతూ ఆలపించిన ఈ గీతం మిమ్మల్ని మీ వూరు తీసుకువెళుతుంది. మీరు ఎక్కడ ఉన్నా ఎంచక్కా పండగ సంబరాలను ఆస్వాదించాలని కోరుకుంటూ మరోసారి మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
Monday, 31 December 2012
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
ముందుగా మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిరుటి ప్రమాణాలను ఎంత వరకు పాటించామో., ఆ లక్ష్యాలను ఎంత వరకు అధిగామించామో నేడు ఒక్కసారి తరచి చూసుకోవాలి. ఆ లోటుపాట్లను సమీక్షించుకుని కొత్త గమ్యాన్ని నిర్దేశించుకుందాం. జ్ఞాపకాలను తడిమి చూసుకుంటూనే వాస్తవంలో నెరవేర్చాల్సిన కర్తవ్యానికి వెన్నంటే ఉందాం. ఒక ఆశావహ భవిష్యత్తు దిశగా జీవితాన్ని నడిపించే క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనేందుకు మనకు అనంతమైన శక్తి యుక్తులు ఇవ్వాలని ఆ భగవంతుడిని మనసారా వేడుకుంటూ అందరికీ మరోసారి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Friday, 28 December 2012
రైతు ప్రగతి పట్టని 2012
వ్యవసాయకంగా పుట్టెడు దిగులును మిగిల్చిన 2012 లో రైతుల స్థితిగతులు ఏమీ
మెరుగు పడలేదు. అన్నదాతల్ని పీల్చి పిప్పి చేసీ ఏ అవకాశాన్నీ పాలకులు
వదల్లేదు. వరుస విపత్తులు రైతుల్ని వెంటాడితే., అసంబద్ద విధానాలతో కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల నడ్డి విరిచే చర్యలకు ఉపక్రమించాయి.
పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. రైతులు విపణిలో పంటల్ని
అమ్మేసుకున్నాక ధరలకు రెక్కలోచ్చాయి. ఎగుమతుల నిర్ణయాలు రైతులకు
ప్రతికూలమయ్యాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే ఎఫ్.డీ.ఐ ల
బిల్లును కేంద్రం అనైతికంగా ఆమోదింపచేసుకుని నైతికంగా ఓడిపాయిందన్న
అపఖ్యాతిని కేంద్రం మూటగట్టుకుంది. ఈ ఏడాది కాలంలో రైతులకు వాటిల్లిన కాస్త
నష్టాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని
మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Wednesday, 26 December 2012
తెలుగు వారి పండగ
అజంత భాషయిన తెలుగు మాధుర్యాన్ని దేశ దేశాల్లోని తెలుగు వారందరికీ చేరువ చేయడం లక్ష్యంగా నేడు ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సభలు 226 విభిన్న కార్యక్రమాలతో తల్లిభాషకు శోభను చేకూర్చబోతున్నాయి. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటం, వికాసానికి కృషి చేయడం, శాస్రీయ జానపద కళారూపాలను ప్రోత్సహించడం, తెలుగు భాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, మాదలిక పదకోశాల రూపకల్పన తదితర 9 ప్రధాన ఆశయాలతో ఈ సభలు జరగనుండటం విశేషం.
అయితే.., పరాయి భాషా వ్యామోహంలో అమ్మ భాష అంతరించిపోయే దుస్థితిని కొని తెచ్చుకొంటున్నాం. సోదర తమిళులు, కన్నడిగులకు ఉన్న భాషాభిమానంలో మనకు ఒక వంతు కూడా లేకపోవడం మనం చేసుకున్న దురదృష్టం. చట్టబద్దంగా తెలుగు అభివృద్ధి సాధికార సంస్థను ఏర్పాటు చేసి, అన్ని ప్రభుత్వ సంస్థలను, వ్యవస్థలను దాని పర్యవేక్షణ కిందకు తీసుకురావాలన్న భాషోద్యమకారుల కోరికను తీర్చే దిశగా మనం ఇంకా ఎన్నో అడుగులు వేయాల్సిన అవసరముంది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా తెలుగు భాషను ఆధునికీకరించడం నేడెంతో అవసరం. భోధనా భాష కాకుండా అమ్మభాష బతకజాలదని నేడందరూ గుర్తించి పాలకులతో సహా అందరూ గుర్తించి ఆచరించాల్సిన తరుణమిది. తెలుగు భాష వికాసం లక్ష్యంగా ఇది మన తెలుగు వారందరి గురుత బాధ్యత. మన కర్తవ్యం కూడా..!
Wednesday, 19 December 2012
పత్తి రైతుకు మార్కెట్ కష్టాలు
నెట్ కు దూరంగా వ్యక్తిగత పని ఒత్తిడిలో ఉండి నిన్న ఈనాడులో ప్రచురితమైన నా
వ్యాసం "మార్కెట్ వలలో విల విల - పత్తి రైతు దూదిపింజే " ను పోస్ట్
చేయలేకపోయాను. రాష్ట్రంలో పత్తి రైతుల మార్కెట్ కష్టాలపై రాసిన ఈ వ్యాసంలో
కేంద్ర పత్తి సంస్థ (సిసిఐ) బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టడం జరిగింది.
బ్లాగు మిత్రుల కోసం వ్యాసం క్లిప్పింగ్ ను ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Subscribe to:
Posts (Atom)






