Thursday, 11 April 2013

శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

                                                           
                                                         

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు తెలుగువారు జరుపుకునే పండుగే యుగాది ఉగాది. తొలి సంవత్సరాదిగా తెలుగు ప్రజలు వ్యవహరించే ఈ పండుగ రోజు ఉదయాన్నే పూజ చేసి షడ్రుచులు కలబోసిన ఉగాది పచ్చడిని సేవించడం మన సంప్రదాయం. వసంత నవరాత్రులు ఆరంభమయ్యే ఈ శుభదినం నుంచి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సకల జనావళికి శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  

Wednesday, 27 March 2013

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ముఖ్యం!

                                                                   

స్థాయీసంఘాల ఏర్పాటుతో బడ్జెట్లో పారదర్సకత, జవాబుదారీతనం పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో బడ్జెట్ పద్దులు 40 ఉండగా, వాటిలో కీలకమైన 37 శాఖలను 12 స్థాయీ సంఘాల పరిధిలోకి తెఛారు. ఒక్కో సంఘంలో ఉభయ సభలకు చెందిన 31 మంది సభ్యులు ఉంటారు. సభ్యులతో పాటు నిపుణులు, మేధావుల విశ్లేషణలతో స్థాయీ సంఘాల నివేదికలు ఉన్తాయి. ఇంటువంటి సంఘాల ద్వారా ప్రతి సభ్యునికి విధి నిర్వహణపరమైన సంతృప్తి లభిస్తుంది.
అంకెల గారడీగా ఉండే బడ్జెట్లో లోతైన విశ్లేషణ చేయడానికి స్థాయీ సంఘాలు ఉపయోగపడతాయి. అయితే స్తాయీసంఘాలు సమర్ధంగా పనిచేసినప్పుడే సత్ఫలితాలు చేకూరతాయి. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేసినప్పుడే వాటి లక్ష్యం నెరవేరుతుంది. శాసనసభకు సమర్పించే నివేదికలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన ఏమీ లెదు. అయితే, ఆ వంకతో తానూ పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే వీటి వల్ల ఫలితం గుండుసున్నా!

Thursday, 7 March 2013

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

                                                             
దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న మహిళలకు సంఘీభావం ప్రకటించే రోజే .... అంతర్జాతీయ మహిళా దినోత్సవం. విద్య, వైద్యం, వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం... ఒకటేమిటి అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా ఒకింత ఎక్కువగానూ నిలిచి గెలుస్తున్నారు మహిళలు. ఆయా రంగాల్లో కష్టాలను ఎదుర్కొంటూనే విజయ బావుటా ఎగుర వేస్తున్నారు. మహిళలు ఇంతగా అభివృద్ధి చెందుతున్నా వారిపై వివక్ష, దాడులు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని డిల్లీలో చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘ్హాతుకమ్... దేశ వ్యాప్తంగా మహిళల భద్రతపై కొత్త భయాలను అనుమానాలను రెకెత్తించిన్ది. అసలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్ని రంగాల్లో నేలకొన్నప్పుడే స్త్రీ, పురుష సమానత్వం సాధ్యమవుతుంది. ఇది అత్యంత త్వరితంగానే సాకారం కావాలని కోరుకుంటూ యావత్ నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

Thursday, 28 February 2013

ఎవరినీ మెప్పించని చిదంబరం బడ్జెట్

                                                          
భారీ అంకెల తిరగమోతగానే యూపీఏ-2 చివరి సంపూర్ణ బడ్జెట్ ను చిదంబరం మహా ఘనంగానే వండి వార్చారు. పన్నుల సంస్కరణల నిర్వహణకు ప్రత్యేక కమిషన్ ను ప్రకటించిన చిదంబరం .. జన సామాన్యం పై వడ్డన భారం పొంచే ఉందని పరోక్షంగా చెప్పారు. గత ఏడాది ఏడాది కంటే 22 శాతం పెంచి వ్యవసాయరంగానికి 27 వేల 49 కోట్లు కేటాయించారు. అలానే ఏడు లక్షల కోట్ల రైతు రుణాల లక్ష్యంలో మంజూరయ్యేది ఎంతన్నదే అసలు ప్రశ్న! రైతుల భధ్రతకు భరోసా ఇవ్వకుండా ఆహార భధ్రత కు సైతం పెద్దగా కేటాయింపులు లేకుండా చిదంబరం బడ్జెట్ చాలా చప్పగా ఉంది. ఒక్క వాఖ్యంలో చెప్పాలంటే ..... అటు ఎన్నికల ఊసులు ఎక్కువగా లేకుండా ఇటు సంక్షేమం ఆశలు వెల్లివిరియకుండా ఎవరినీ పెద్దగా సంతృప్తి పరచకుండానే సాగిన బడ్జెట్ ఇది.

Monday, 25 February 2013

కేంద్ర బడ్జెట్లో వ్యవ'సాయం' పెరగాలి

ఏళ్ళు గడుస్తున్నా రైతుల పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఆహారభద్రత గురించి గొంతు చించుకుంటున్న యూపీఏ ప్రభుత్వం దీనికి మూలమైన వ్యవసాయ రంగ అభివృద్ధిని విస్మరిస్తోంది.  సాగులో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగాలంటే రైతుకు చేయూత అవసరం. అందుకు తగిన సాంకేతికతను అందుబాటులో ఉంచాలి. ఇవేమీ చేయకుండానే వ్యవసాయం బాగున్నట్టు ఆహార భద్రత కల్పించేస్తామంటూ కేంద్రం ప్రజల్ని మభ్య పెడుతోంది. దశాభ్దాలుగా సేద్యరంగాన్ని  నిర్లక్ష్యం చేసిన ఫలితంగా రైతుల పరిస్థితి దిగజారింది. ముందు రైతుల్ని నిలబెట్టే చర్యలకు ఉపక్రమించకుండా  బడ్జెట్లలో కేంద్రం వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపుతూ వచ్చింది. 28న కేంద్రం ప్రవేశ పెట్టనున్న సాధారణ బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉండాలి ? రైతుల పరిస్థితి మెరుగు పడాలంటే ఏం చేయాలో సూచిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                             

Tuesday, 12 February 2013

రైతుల కోసం ప్రభుత్వాలు మారవా ?

వ్యవసాయంలో దేశం ఎంతో పురోగమించింది అన్నది తిరుగులేని వాస్తవం. మరి మన రైతులెందుకు చితికిపోతున్నారు..?  అన్ని వర్గాల ప్రజలు జీవితంలో ఎంతో కొంత ప్రగతి సాధిస్తే., రైతుల పరిస్థితే  ఎందుకని దిగజారుతోంది.. ? ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానం చెప్పలేక పోతున్నాయి. రైతు శ్రేయం కాపాడే విషయంలో చేతకానివిగా మిగిలిపోతున్నాయి. రైతుకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ప్రభుత్వాలకు తెలిసినా అవి అందించే విషయంలో ఆడ్డుపడుతున్న శక్తులను నియంత్రించలేని తీరు వల్ల అన్నదాతలు సేద్యంలో చితికిపోతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ, సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వ్యవసాయ దిగుబడులు పెరుగుతున్నాయి. అయితే.., హెక్టారు సగటు ఉత్పాదకతలో ఆశించిన పురోగతి లేక రైతుకు మిగులుబాటు ఉండటం లేదు. కాయకష్టం చేసి సిరులు పండిస్తున్నా రైతుల పరిస్థితి దయనీయంగా ఉండటానికి దారితీస్తున్న  కారణాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                    

Sunday, 13 January 2013

పొలంలో పండాలి క్రాంతి


సంక్రాంతి రైతుల పండగ. ధాన్యపు రాశులు ఇంటికి చేరే సమయం కాబట్టే  ఇది రైతుల పండగయ్యింది. సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో, రైతుల ముంగిళ్ళలో కనిపించే ఆ శోభ అనిర్వచనీయం. దురదృష్టవశాత్తూ రైతుల కళ్ళల్లో పండగ నాటి ఆనందం నేడు కనిపించడం లేదు. చేతి నిండా నాలుగు డబ్బులుండే పరిస్థితుల నుండి మన రైతులు పంట ఇంటికి చేరకుండానే కల్లంలోనే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వాల చేయూత లేక చితికిన రైతుల్ని   ఎవరూ పట్టించుకోకపోవడంతో  అన్నదాతలు సంక్రాంతి ఆనందాలకు దూరమవుతున్నారు. ఈ  పరిస్థితులను విశ్లేసిస్తూ నేను రాసిన  వ్యాసాన్ని నేటి  సంక్రాంతి రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేశాను.