Sunday, 12 January 2014

భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.

ప్రకృతి తో మనిషి సహజీవనం చేసే అసలైన పండగ సంక్రాంతి. భోగిమంటలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, పల్లెసీమలు, గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపందేలు, పతంగులు, ఎడ్లపందాలు, ధాన్యపురాశులు, పశువుల పూజలు, అంతకు మించి అమ్మ చేసే పిండివంటలు....  ఇవన్నీ కలగలిసి చేసుకునే అపురూపమైన అతి పెద్ద పండగే సంక్రాంతి. కష్టాలు భోగి మంటల్లో ఆహుతై ఈ సంక్రాంతి నుంచి కొత్త ఆశల కిరణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో  ప్రసరించాలని కోరుకుంటూ మిత్రులందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు.
                                                                               

Tuesday, 31 December 2013

కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యుల ఆశలు ఆశయాలు ఫలించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ......

                             నూతన సంవత్సర శుభాకాంక్షలు


                                                                                  

Wednesday, 25 December 2013

వ్యవసాయం గాలిలో దీపం!

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఈ ఏడాది పాలకులకు ప్రజా సమస్యలు పట్టకుండా పోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల వ్యవసాయరంగం తీవ్రంగా ప్రభావితమైంది. రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గడచిన ఐదేళ్ళలో కేవలం ఒక్క ఏడాది మాత్రమే మంచి పంటను దక్కించుకున్న రైతులు వరుస నష్టాలతో అప్పులు పెంచేసుకున్నారు. ఈ ఏడాది సేద్య రంగం స్థితిగతులపై నేను రాసిన సమీక్షను ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ఈ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                                 

Tuesday, 10 December 2013

బాలి లో ధనిక దేశాలకు తాత్కాలికంగా చెక్!

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లు టి వో ) 9వ మంత్రిత్వ స్థాయి సమావేశాలు ఇండోనేసియా లోని బాలి లో ఈ నెల 6న ముగిశాయి. వ్యవసాయ సబ్సిడీలను మొత్తం ఆహార ఉత్పత్తుల్లో 10 శాతానికి తగ్గించాలన్న సంపన్న దేశాలు తాము 40  శాతానికి పైగా సబ్సిడీలు అందిస్తూ సుద్దులు చెబుతున్నాయి. ఈ నిబందనలు అమల్లోకి వస్తే తమ దేశంలో అమలు జరుగుతున్న  ఆహార భద్రత పధకానికి ముప్పు వాటిల్లుతుందని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్ వాదనను అంగీకరించక తప్పని పరిస్థితుల్లో ధనిక దేశాలు దిగి వచ్చాయి. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా ముఖ్యంగా పేద దేశాలకు విజయంగా చెప్పవచ్చు. ఈ అంశాలపై డబ్లు టీ వో చర్చలు ముగిసిన రోజు రాత్రి నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                                       

Friday, 8 November 2013

పంట చేలో ఒంటరి దిష్టిబొమ్మ

ఇటీవల నేను రాసిన పంట చేలో ఒంటరి దిష్టిబొమ్మ కవిత ఈ నెల తెలుగు వెలుగు పత్రికలో (46వ పేజీ) ప్రచురితమైంది. మీ కోసం ఇక్కడ కవితను అప్ లోడ్ చేస్తున్నాను.  
                                                                                  

Saturday, 2 November 2013

శుభాలనిలిచ్చే వెలుగుల పండగ

దీపావళి అందరి పండగ. దివ్వెలు వెలిగించి ప్రేమలు పంచుకునే ఈ పర్వదినాన ప్రతి ఒక్కరి ఇంటా ఆనంద జ్యోతులు వెలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
                                                                           

Wednesday, 30 October 2013

పంట చేలల్లో కన్నీటి మంటలు

 
విపత్తులు ఉరుముతున్నప్పుడల్లా  రాష్ట్ర రైతులు చిగురుటాకులా కంపించిపోతున్నాడు. ఏటా ఉత్పాతాలు విరుచుకుపడిన ప్రతిసారీ పంటలు ధ్వంసమై రైతులు చితికిపోతుండటం పరిపాటిగా మారుతోంది. గడచిన పదేళ్ళలో నాలుగు పంటలే దక్కాయి. నష్టం జరిగిన ప్రతిసారీ పాలకులు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప చిటికిన బతుకులకు సాంత్వన కలిగించే చర్యలు చేపట్టడం లేదు. విపత్తుల విషయంలో ప్రకృతి కంటే ప్రభుత్వమే రైతుల్ని ఎక్కువగా గాయపరుస్తోందంటూ నేను రాసిన వ్యాసాన్ని  ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.