సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేలా, దేశ, విదేశాల్లోని అపురూప, పురాతన దేవాలయాల గురించి కోట్లాది వీక్షకులకు అవగాహన కల్పిస్తున్న ఈటీవి "తీర్ధయాత్ర" కార్యక్రమాన్ని గుర్తించి తగురీతిలో గౌరవించింది అమెరికాకు చెందిన "గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ. దేవాలయాల పరిరక్షణ గురించి ఈ నెల 22 నుంచి హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో నిర్వహించిన అంతర్జాతీయ లఘు చిత్ర ప్రదర్శన సందర్భంగా ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో పరమహంస పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి చేతుల మీదుగా నేను "సనాతన హిందూ ధర్మ రక్షక్ పురస్కారం" ను అందుకున్నాను. ఈ పురస్కారాన్ని అందించి గౌరవించిన ఫౌండేషన్ చైర్మన్ వెలగపూడి ప్రకాశరావు గారు, "గజల్ మ్యాస్ట్రో" ఆత్మీయ మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు. ఈనాడు హైదరాబాద్ మినీ ఎడిషన్ లో వచ్చిన కవరేజీ క్లిప్పింగ్ ఇది.
Monday, 25 August 2014
Saturday, 9 August 2014
నాలుగు దశాభ్దాల "ఈనాడు"
రేపు ఆగస్టు 10 కి సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం ఈ రోజునే తెలుగు పత్రికా ప్రపంచాన "ఈనాడు" అక్షర దీపార్చన ఆరంభించింది. కేవలం 4500 కాపీలతో మొదలెట్టి అగ్రశ్రేణి తెలుగు దినపత్రిక గా అప్రతీహతంగా ముందుకు సాగుతోంది. పత్రికా రంగంలో ప్రయోగాలకు పుట్టినిల్లుగా నిలిచి., ఎన్నో సంచలనాలకు శ్రీకారం చుట్టిన పత్రికగా "ఈనాడు" తెలుగు వారి గుండెలలో కొలువుదీరింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, వార్తా ప్రమాణాలకు సరికొత్త భాష్యం చెప్పింది. ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా ఏనాడూ వెన్ను చూపకుండా సవాళ్ళను స్వీకరించి దృడంగా నిలిచింది.
ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ముంచుకొచ్చిన ప్రతిసారీ బాధ్యతను గుర్తెరిగి నిరంకుసాధికారానికి ఎదురొడ్డి పోరాడింది. విశ్వసనీయత, నైతిక విలువలే గీటురాళ్ళుగా పవిత్ర విలువల పరిరక్షణ కోసం సొంత వ్యక్తిత్వాన్ని "ఈనాడు" ఏనాడూ వదిలి పెట్టలేదు. ప్రజల పక్షాన ఉద్యమ శంఖాలను పూరించడంలో., విపత్తులు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతను స్వీకరించడంలోనూ "ఈనాడు" ది ఎప్పుడూ ముందుండే తత్వమే.
కోట్లాది ప్రజల ఆశీస్సులతో తెలుగువారి ఇంటింటి నేస్తం గా "ఈనాడు" ఇప్పటికీ మరెప్పటికీ వెలుగొందుతూనే ఉంటుంది. ఈనాడు తో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈనాడు మిత్రులందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు. "నాలుగు దశాభ్దాల ఈనాడు" పై ఈ రోజు రాత్రి 9 గంటలకు., తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ఈటీవి ఆంధ్రప్రదేశ్, ఈటీవి తెలంగాణ చానళ్లు ప్రత్యేక చర్చను ప్రసారం చేస్తున్నాయి. లోక్ సత్తా జాతీయ అధ్యక్షులు డా. జయప్రకాశ్ నారాయణ, ప్రముఖ తెలుగు దిన పత్రికలకు సంపాదకులుగా పని చేసిన సీనియర్ పాత్రికేయులైన ఇనగంటి వెంకట్రావు, కె. రామచంద్రమూర్తి , పొలిటికల్ ఎనలిస్ట్ సి. నరసింహారావు లు ఈ చర్చలో పాల్గొన్నారు. ఆసక్తి ఉన్న పాత్రికేయ మిత్రులు తప్పక చూడాల్సిన చర్చ ఇది.
Wednesday, 6 August 2014
Tuesday, 29 July 2014
యాపిల్స్ కొనేటప్పుడు జాగ్రత్త!
ఈ రెండు ఫోటోలను జాగ్రత్తగా గమనించండి. మొదటి ఫోటో లోని యాపిల్స్ నిగ నిగ మెరిసిపోతున్నాయి కదూ! ఇక రెండో, మూడో ఫోటోలను చూడండి... ఎలాంటి ఆకర్షణ లేకుండా ఉన్న ఈ యాపిల్స్ కంటే మొదటి ఫోటోలోని యాపిల్స్ కొనడానికే వినియోగదారులు ఇష్టపడుతుంటారు. నిజానికి మన సిమ్లా లో విరివిగా పండే యాపిల్స్ రెండు, మూడు ఫోటోలలోనివే. మొదటి రకం యాపిల్స్ విదేశీ యాపిల్స్. విదేశీ యాపిల్స్ ఇంతలా మెరిసిపోవడం వెనుక వాటికి వ్యాక్స్ కోటింగ్ వేస్తారని మీకు తెలుసా?
గిరాకీకి తగ్గ సరఫరా మన దేశంలో లేకపోవడం వల్ల మనం యాపిల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ లోని కొంత భాగంలో పండే దేశీయ యాపిల్స్ ఏటా ఆగస్ట్ నెల నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్, చిలీ, ఇరాక్ (వయా ఆఫ్ఘనిస్తాన్) చైనా ల నుంచి మన దేశంలోకి యాపిల్స్ యథేచ్చగా వచ్చిపడుతున్నాయి. యాపిల్స్ నిల్వ కాలాన్ని దాదాపు 10 నెలల వరకు పెంచాలంటే ప్రాసెస్ చేసిన పండ్లకు విదేశాల్లో ఎగుమతిదారులు ఎంచుకునే మార్గం వ్యాక్స్ కోటింగ్. ఇలా చేయటం వల్ల అవి తినేవారికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఈ పండ్ల తోలు తీసి తిన్నప్పటికీ సమస్యలు వెంటాడే ప్రమాదముంది.
అందువల్ల యాపిల్స్ కొనుగోలు చేసేవారు పండు ఆకర్షణ చూసి మోసపోకుండా మార్కెట్లో వ్యాక్స్ కోటింగ్ లేని యాపిల్స్ చూసి కొనటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలానే దేశీయ పండ్లను చెట్టు నుంచి కోశాక వాటి సహజత్వం దెబ్బతినకుండా బాక్స్ లలో రవాణా చేస్తుంటారు. నిజానికి రెండో ఫోటోలో ఉన్న యాపిల్స్ ఇలానే ఉంటాయి. కోసిన వాటిని ప్రాసెస్ చేసి వ్యాక్స్ కోటింగ్ వేయకుండా కొంచెం ఆకర్షణీయంగా ఉండేవి మూడో ఫోటోలోనివి. వీటిని తిన్నా నష్టం లేదు. అలా చేస్తే వాటిని నిల్వ చేసే కాలం కొద్దిగా తగ్గుతుంది అంతే. మొత్తం మీద ఏ పండ్లు కొన్నా వాటిని మంచి నీటితో శుబ్రంగా కడిగి తినటం మంచిది.
సుమారు రూ. 4,500 కోట్ల విలువైన దేశీయ యాపిల్స్ తో పాటు ఏటా భారతీయ వినియోగదారులు దాదాపు రూ.,2000 కోట్ల విలువైన యాపిల్స్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దేశీయంగా వినియోగించే యాపిల్స్ లో 60 శాతం వరకు దక్షిణ భారత దేశంలోనే అమ్ముడుపోతుండటం విశేషం. యాపిల్స్ కొనే దక్షిణ భారత పౌరులూ పారాహుషార్! (సిమ్లా మిత్రుడు పురుషోత్తమరావు వెలది సహకారంతో)
Monday, 7 July 2014
మోడీ వ్యవసాయాన్ని గట్టేక్కిస్తారా?
యూపీయే పాలనా కాలంలో అప్పటి వ్యవసాయ మంత్రి శరద్ పవార్ అస్తవ్యస్త నిర్ణయాలతో దేశంలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. రైతుల ఆత్మహత్యలు విపరీత స్థాయికి చేరాయి. ఈ తరుణంలో ఢిల్లీ పగ్గాలు చేపట్టిన నరేంద్రమోడి ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టనున్న సాధారణ బడ్జెట్ లో రైతులకు వ్యవసాయంపై భరోసా పెంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. సమస్య మూలాలకు చికిత్స ఎంత ముఖ్యమో, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడమూ అంటే ప్రధానం. ఈ పరిస్థితులను విశ్లేషిస్తూ రాసిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లలో ప్రచురించింది. మీ కోసం ఆ వ్యాసాన్నిఇక్కడ లింక్ చేస్తున్నాను.
Sunday, 1 June 2014
Friday, 16 May 2014
ఇది అవినీతిపై ప్రజల విజయం
బాబు-మోడీ జోడీది చారిత్రాత్మక విజయం. అవినీతిపరుల్ని కుంభకోణాలకు పాల్పడిన వారిని పార్టీలకు అతీతంగా ఓడించిన తీరు చూస్తుంటే., ప్రజలెంత కసిగా కాంగ్రెస్ ను, ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ను మట్టికరిపించారో చూస్తేనే తెలుస్తోంది. అలానే పోటెత్తిన ఉద్యమం నుంచి ప్రభవించిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ పార్టీకి ఘనవిజయం అందించడం చూస్తే తెలంగాణ ప్రజలు ఎంతగా స్వపరిపాలన కోరుకున్నారో అర్ధమవుతోంది.ఇష్టానుసారం రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను ఇరు రాష్ట్రాల ప్రజలు రెండు కళ్ళు పొడిచేసారు. కన్నూమిన్నూ కానక సమాజాన్ని లెక్కపెట్టక ఇష్టానుసారం వ్యవస్థలను దోపిడీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను చూస్తే స్పష్టమవుతోంది. జగన్ తో కలిపి నీ కిది నా కిది లో పాలుపంచుకున్న వారంతా దాదాపుగా ఓటమి పాలవటం చూస్తే, వేల కోట్లు దోచుకున్న వారిపై ఇది ప్రజల విజయంగా చెప్పాలి. ఈ తీర్పు దోపిడీ రాజకీయాలకు, అవినీతిపరులకు చెంప పెట్టు మాత్రమె కాదు చావుదెబ్బ కూడా.
Subscribe to:
Posts (Atom)
.png)









