Friday, 20 March 2015

ఉగాది మీడియా పురస్కారం

                                                               
     
హైదరాబాద్ చెందిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ ఏడాది  "ఉగాది మీడియా పురస్కారం" కు నన్ను ఎంపిక చేసినట్టు ఫోన్ చేసి చెప్పారు. ఆహ్వానం పంపించారు. సుదీర్ఘకాలం మీడియా లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు, మీడియా ఎడిటర్లకు ఈ అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎన్ టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. నాతొ పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైయెస్సార్ శర్మ, సూర్య ఎడిటర్ సత్యమూర్తి, ప్రజాశక్తి ఎడిటర్ ఎస్. వీరయ్య, కళ పత్రిక ఎడిటర్ మహమ్మద్ రఫీ, అంకం రవి (వీ6 ఛానల్ ) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ టీవీ ), హరిప్రసాద్ (టీవీ9), ఈశ్వర్ (6టీవీ), సాయి (జెమిని న్యూస్)లు  కూడా ఉగాది మీడియా పురస్కారాలు అందుకోనున్నారు.
అయితే  రవీంద్రభారతి లో  అవార్డు తీసుకోవాల్సిన 23వ తేదీన  నేను తిరుమలలో ఉండాల్సిన కారణంగా ఈ అవార్డును నేను స్వయంగా స్వీకరించలేకపోతున్నట్టు  నిర్వాహకులకు తెలిపాను. నా తరపున సహచరుడు మధుసూధనాచారి ఈ అవార్డును స్వీకరిస్తారు. నా మిత్రులు, మరికొందరు సీనియర్ జర్నలిస్టు మిత్రులను ఈ సందర్భంగా కలుసుకోలేక పోతున్నందుకు కొంత బాధగానూ ఉంది.  నాకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు.
                                                                  

Monday, 2 March 2015

అన్నం పెట్టె రైతే కాడి వదిలేస్తే...!

వ్యవసాయంలో 4 శాతం వృద్ధి రేటు సాధించాలంటే ఆందుకు అనుసరించే వ్యూహం సరైనదై ఉండాలి. నిర్దిష్ట వ్యుహాలేమీ లేకుండా సేద్యానికి మొండిచేయి చూపించింది కేంద్ర బడ్జెట్. దిశ దశ లేకుండా వ్యవసాయంలో ఏదో సాధించేస్తామంటే అది ఒట్టిమాటే. జైట్లీ బడ్జెట్ లో ఇటువంటి కమ్మని కబుర్ల్లెన్నో ఉన్నాయి. ''దేశంలో రైతు జేబు నింపడానికి వ్యవసాయరంగానికి తగిన సామర్ధ్యం ఉంది అన్న ప్రభుత్వానికి, రైతు శ్రేయం పట్ల మాత్రం నిజమైన చిత్తశుద్ధి లేకపోయింది.'' కేంద్రబడ్జెట్ లో వ్యవసాయరంగాన్ని విస్మరించిన తీరుపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
                                                           

Monday, 16 February 2015

శంభో శంకర

                                                      హరహర మహాదేవ శంభో శంకర
                                                                 

Tuesday, 10 February 2015

కేజ్రీవాల్ సునామీ !

                                                                                 
 
దిల్లీ ఎన్నికల్లో సామాన్యుడిదే విజయం. హస్తిన కురుక్షేత్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ సునామీ సృష్టించింది. మొత్తం 70 సీట్లలో 67 స్థానాలు వూడ్చేసిందంటే అది మామూలు సునామీ కాదు. పాపం కమలనాధుల గర్వం మొత్తం అణిగిపోయేలా దిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రకు నాందిగా చెప్పవచ్చు. బీజేపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదనుకుంటే., కాంగ్రెస్ పరిస్థితి గుండు సున్నా. ఏదేమైనా కేజ్రీవాల్ పోయిన చోట వెతుక్కుంటే., బీజేపీ, కాంగ్రెస్ లు బిక్క చచ్చిపోయాయి. మొత్తంగా  ప్రజలు తలుచుకుంటే మార్పును ఎలా తీసుకురాగలరో ప్రతి పార్టీకి, రాజకీయనాయకులకు కళ్ళు తెరుచుకునేలా దిల్లీ ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారు.   

Wednesday, 4 February 2015

నా తొలి కవితా గోష్టి తీపి గురుతులు

                                                                             

జవహర్ లాల్ నెహ్రూ శతజయంతి ఉత్సవాల సందర్భంగా 1989 లో నేను తొలిసారిగా  గుంటూరు జిల్లా రేపల్లెలో ఒక కవితా గోష్టిలో పాల్గొన్నాను. రేపల్లె ఎబీఆర్ కాలేజీ లో చదువుతున్నప్పుడు వ్యాసరచన, వ్యకృత్వం, క్విజ్, డిబేట్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో బహుమతులు సాధించాను. నేను నా మిత్రులు మూడేళ్ళలో కనీసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు డజన్లకు పైగా కప్పులు, షీల్డులు గెల్చుకొచ్చాం.   మా కళాశాల ప్రిన్సిపాల్ కేజేసీ హరివిటల్ గారు నాకూ  నా సహచరులు కుమార్, రావెళ్ళ లకు నేలకోసారన్నా అభినందన సభలు పెట్టేవారు. పేపర్లలో ఈ వార్తలు తరచుగా చూసిన  సాహితీ భారతి  అనే సంస్థ వారు రేపల్లె పట్టణంలో 14-11-89 న నిర్వహించిన కవితా గోష్టికి నన్ను ఆహ్వానించారు.  ఎందుకో ఈ మధ్య నా పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఫైల్ చూస్తుంటే  ఈ కరపత్రం నిపించింది.  ఎన్నో జ్ఞాపకాలు  నన్ను ముంచెత్తాయి. నాతో పాటు ఈ గోష్టిలో పాల్గొన్న వారిలో "అహనా పెళ్ళంట" సినిమాలో ఒకే ఒక్క పాట రాసిన (కస్తూరి రంగయ్యా కరుణించవేమయ్యా..) శాస్త్రి గారు కూడా ఉన్నారు. 

Wednesday, 14 January 2015

సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి అంటే రైతుల పండుగ. పల్లెల పండుగ.  పల్లె, పట్టణ సీమలన్నీ సంక్రాంతి శోభతో వెల్లివిరిసిన ఈ వేళ...  ప్రతి ఒక్కరి మనసు సంతోషంతో నిండాలని., పంటలు బాగా పండి రైతులందరూ సుఖంగా జీవించాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
                                       

Friday, 2 January 2015