Thursday, 14 May 2015

ఇజ్రాయెల్‌ పర్యటనలో కొన్ని జ్ఞాపకాలు

ఇజ్రాయెల్‌ లో కొన్ని దృశ్యాలు... టెల్‌అవివ్‌ బీచ్‌, గెలీలీ సరస్సు దృశ్యాలు, మృత సముద్ర తీరం, ఇజ్రాయెల్‌ వ్యవసాయ మంత్రి ఏర్‌ షమిర్‌తో నేను, టెల్‌అవివ్‌ బీచ్‌ రోడ్డులో కొన్ని జ్ఞాపకాలు, నాతో భారత్‌ నుంచి వచ్చి పాత్రికేయులతో, ఎకోమ్‌ నది, ఇజ్రాయెల్‌లో ఒక వీధి (ఇజ్రాయెల్‌లో కార్లు రోడ్డుకు రెండు వైపులా పార్క్ చేస్తారు), వేదిక ముందు నా జ్ఞాపకాలు, చెర్రీ టమాటోలు, ఇజ్రాయెల్‌ ట్రాఫిక్‌, ట్రాఫిక్‌ క్రమశిక్షణ, పరదాల కింద అరటి సాగు, ఈతపండ్లు, డెయిరీఫామ్‌లో ఆవులు, బిందుసేద్యం, కంప్యూటర్‌ నియంత్రిత బిందు సేద్య వ్యవస్ధ, ఇలియహు కిబుట్జ్‌ ప్రాంతం, గ్రీన్‌హౌస్‌లలో పూల సాగు, టులిప్స్‌, బిందుసేద్యం చేస్తున్నపొలం, వ్యర్ధజలాలను శుద్ధి చేసి చేలకు అందించే పరికరాలు, టమాటోలు, స్ర్పింక్లర్‌ సాగు, కిబుట్జ్‌లో ఇజ్రాయెల్‌ కుటుంబం, పండ్ల గ్రేడింగ్‌ మిషన్‌, భారీ స్థాయిలో గ్రీన్‌హౌస్‌ సేద్యం, ఏ ఇంటిపైన చూసినా సౌర ఫలకాలే, సోలార్‌ వాటర్‌ హీటర్లే., సౌరశక్తిని వారెంతగా వాడుతున్నారో చెప్పే చిత్రాలివి.., ఇజ్రాయెల్‌ విమానాశ్రయం ముందు నేను.

























ఇజ్రాయెల్‌ పర్యటన, జెరూసలేమ్‌ దృశ్యాలు

ఇటీవలి ఇజ్రాయెల్‌ పర్యటన తర్వాత తీవ్ర పనుల ఒత్తిడ వల్ల గత వారం రోజులుగా ముఖపుస్తకంలోకి తొంగి చూసే వీలు చిక్కలేదు. మీ రచనలు తప్ప ఫోటోలు గట్రా ఏమీ పెట్టలేదేమని పలువురు మిత్రులు ఇప్పటికే సందేశాలు పంపి ఉన్నారు. ఈ పర్యటనలో నేను ఇస్తాంబుల్, జెరూసలేమ్‌, టెల్‌అవీవ్‌ మహానగరాలను చూసే అవకాశం దక్కింది. మొదటి 4 ఫోటోలు ముంబయ్‌ ఎయిర్‌పోర్టులో., తర్వాత ఇస్తాంబుల్‌ ఫ్లైట్‌లో., తర్వాత సాయంత్రం వేళ ఫైట్‌లో ఇజ్రాయెల్‌ వెళ్తున్నప్పటి దృశ్యం., తర్వాత మృతసముద్ర లోయ జెరూసలేమ్‌ నుంచి., హీబ్రూ వర్సిటీ ఏరియా నుంచి జెరూసలేమ్‌ దృశ్యాలు., జెరూసలేమ్‌లో ఏసుక్రీస్తు కాలం నాటి చర్చిలు, శిలువ మోసుకుంటూ వెళ్లిన స్టేషన్లు, శిలువ వేసిన ప్రాంతం, వారి సమాధి, చివరగా వెస్ట్రన్‌ వాల్‌ లేదా ఏడుపు గోడ డోమ్‌ ఆఫ్‌ రాక్‌, జెరూసలేమ్‌ వీధుల్లో నేను, క్రీస్తు నడచిన కాలం నాటివని చెప్తున్న బండలు తదితర దృశ్యాలు.





























Wednesday, 13 May 2015

ఇజ్రాయెల్‌ వ్యవసాయంపై కొన్ని కథనాలు

ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా నేను ఏకకాలంలో అటు ఈనాడుకు ఇటు ఈటీవీకి పనిచేయాల్సి వచ్చింది. చూసిన ఒక అంశంపై ఒక వీడియో ఒక ఫోటో తీసుకోవడం అదే సమయంలో వారు వివరిస్తున్న సమాచారాన్ని గ్రహించడంలో ఇబ్బందులు ఎదురైనా., అవన్నీ తెలుసుకోవాలనే నా ఆసక్తి ముందు తేలిపోయాయి. ఈ పర్యటన సందర్బంగా ఈనాడుకు నేను రాసిన కథనాల క్లిప్పింగ్స్‌ను ఇక్కడ ఇస్తున్నాను. మరికొన్ని కథనాలు రాస్తున్నాను. మునుముందు వాటినీ ముఖపుస్తక మిత్రులకు అందిస్తాను. ఈటీవీలో 4వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇజ్రాయెల్‌ వ్యవసాయంపై ఇదీసంగతిలో ఒక అరగంట ప్రత్యేక కార్యక్రమంతో పాటు మరికొన్ని కథనాలు ప్రసారం అయ్యాయి. ఇందుకు సహకరించిన ఈనాడు, ఈటీవీ సహోద్యోగులకు నా కృతజ్ఞతలు. ఈ డాక్యుమెంటరీని, కథనాలను చూసి ప్రశంసించిన మా గౌరవ ఛైర్మన్‌ రామోజీరావుకు వేనవేల కృతజ్ఞతలు.

Hari Krishna Amirneni's photo.


from జైకిసాన్ http://ift.tt/1Hind8o

ఇజ్రాయెల్‌ వ్యవసాయంపై నా కథనాలు

ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా నేను ఏకకాలంలో అటు ఈనాడుకు ఇటు ఈటీవీకి పనిచేయాల్సి వచ్చింది. చూసిన ఒక అంశంపై ఒక వీడియో ఒక ఫోటో తీసుకోవడం అదే సమయంలో వారు వివరిస్తున్న సమాచారాన్ని గ్రహించడంలో ఇబ్బందులు ఎదురైనా., అవన్నీ తెలుసుకోవాలనే నా ఆసక్తి ముందు తేలిపోయాయి. ఈ పర్యటన సందర్బంగా ఈనాడుకు నేను రాసిన కథనాల క్లిప్పింగ్స్‌ను ఇక్కడ ఇస్తున్నాను. మరికొన్ని కథనాలు రాస్తున్నాను. మునుముందు వాటినీ ముఖపుస్తక మిత్రులకు అందిస్తాను. ఈటీవీలో 4వ తేదీ రాత్రి 7.30 గంటలకు ఇజ్రాయెల్‌ వ్యవసాయంపై ఇదీసంగతిలో ఒక అరగంట ప్రత్యేక కార్యక్రమంతో పాటు మరికొన్ని కథనాలు ప్రసారం అయ్యాయి. ఇందుకు సహకరించిన ఈనాడు, ఈటీవీ సహోద్యోగులకు నా కృతజ్ఞతలు. ఈ డాక్యుమెంటరీని, కథనాలను చూసి ప్రశంసించిన మా గౌరవ ఛైర్మన్‌ రామోజీరావుకు వేనవేల కృతజ్ఞతలు.

Wednesday, 6 May 2015

సహచరుల ఆత్మీయత

ఇజ్రాయెల్‌ నుంచి రాగానే నా సహచర బృందం నాకో తీపి జ్ఞాపకాన్ని అందించింది. పాత్రికేయంలో మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆశీర్వదించింది. ఒక బాస్‌గా కాకుండా వారి బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరిస్తున్న ఒక శ్రేయోభిలాషిగా వారు నన్ను చూస్తున్న తీరు నాకు సంతోషానిచ్చింది. నా బృందంలోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా వందనాలు. మిత్రులారా మీ ఆత్మీయతను మరువలేను. మీ పట్ల నా బాధ్యతలను ఏ నాడూ మరచిపోను. అందరికీ ధన్యవాదాలు. 
                                                           

Sunday, 3 May 2015

ఆహార వృథా... ఆకలి వ్యథ

ఇజ్రాయెల్‌లో నాకిచ్చిన రోమింగ్‌కార్డు నన్ను తీవ్రంగా సతాయించింది. అందుకే ఏ పోస్టులూ పెట్టలేకపోయాను. చాలా రోజుల తర్వాత ముఖపుస్తకం ద్వారా మిత్రులతో మాట్లాడే అవకాశం చిక్కింది. ఇజ్రాయెల్‌ పర్యటన నాకు మంచి విషయాలను వారి సాంకేతికత గొప్పదనాన్ని తెలుసుకునే అవకాశం ఇచ్చింది. వీటిని క్రోడీకరించి ఈటీవీలో ఇప్పటికే 4 కథనాలు ప్రసారం చేశాం. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఒక అరగంట సేపు ఇజ్రాయెల్‌ సాంకేతికతపై స్పెషల్‌ ఫీచర్‌ ఇస్తున్నాము. వీలైతే చూడండి. అలానే ఈనాడుకూ కథనాలు పంపిస్తున్నాను. అన్నట్టు ఆహార వృథా ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించిన ఇజ్రాయెల్‌ ప్రదర్శనపై ఈరోజు నేను రాసిన వ్యానం ఈనాడు ఎడిట్‌ పేజీలో వచ్చింది. చూడగలరు. మీ కోసం ఆ క్లిప్పింగ్‌ ఇక్కడ ఇస్తున్నాను.
                                                             


from జైకిసాన్ http://ift.tt/1IEEiZo

ఆహార వృథా... ఆకలి వ్యథ

ఇజ్రాయెల్‌లో నాకిచ్చిన రోమింగ్‌కార్డు నన్ను తీవ్రంగా సతాయించింది. అందుకే ఏ పోస్టులూ పెట్టలేకపోయాను. చాలా రోజుల తర్వాత మిత్రులతో మాట్లాడే అవకాశం చిక్కింది. ఇజ్రాయెల్‌ పర్యటన నాకు మంచి విషయాలను వారి సాంకేతికత గొప్పదనాన్ని తెలుసుకునే అవకాశం ఇచ్చింది. వీటిని క్రోడీకరించి ఈటీవీలో ఇప్పటికే 4 కథనాలు ప్రసారం చేశాం. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఒక అరగంట సేపు ఇజ్రాయెల్‌ సాంకేతికతపై స్పెషల్‌ ఫీచర్‌ ఇస్తున్నాము. వీలైతే చూడండి. అలానే ఈనాడుకూ కథనాలు పంపిస్తున్నాను. అన్నట్టు ఆహార వృథా ప్రధాన ఇతివృత్తంగా నిర్వహించిన ఇజ్రాయెల్‌ ప్రదర్శనపై ఈరోజు నేను రాసిన వ్యానం ఈనాడు ఎడిట్‌ పేజీలో వచ్చింది. చూడగలరు. మీ కోసం ఆ క్లిప్పింగ్‌ ఇక్కడ ఇస్తున్నాను.