Thursday, 31 December 2015

కర్షకరత్న పురస్కారం

                                                                     
మీ అందరి ఆశీస్సులతో ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజు కర్షకరత్న పురస్కారం అందుకోబోతున్నాను. మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావుతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 108 ఆదర్శ రైతులు, రైతు బాంధవులకు రేపు ఉదయం 9 గంటకు మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఈ పురస్కారాలు ఇచ్చి సత్కరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మియాపూర్‌లోని శ్రీధర్మపురి క్షేత్ర ట్రస్టు బో్ర్డు వారు, భారతీయం సంస్ధ నిర్వాహకులు శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, జాతీయ ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి కోటి వరి కంకులతో పూజ చేస్తారు. రైతు ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సీనియర్‌ జర్నలిస్టుగా నాకీ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వారికి నా ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Tuesday, 10 November 2015

దీపావళి శుభాకాంక్షలు

ఈ ఆనందాల శుభవేళ...
హితులు, సన్నిహితులు..
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
 


from జైకిసాన్ http://ift.tt/1HGR8mE

దీపావళి శుభాకాంక్షలు

ఈ ఆనందాల శుభవేళ...
హితులు, సన్నిహితులు, మిత్రులందరికీ...
దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

Thursday, 22 October 2015

విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!!

                                                           


ఒక మహోద్విగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజా రాజధాని అమరావతికి పునాదిరాయి పడింది. విజయదశమి శుభదినాన విజయోస్తు అంటూ ఆశీస్సులు అందాయి. ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది. అమరావతి విశ్వరాజధానిగా వెలుగొందుతుంది. విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!! తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.


from జైకిసాన్ http://ift.tt/1Np8Cbq

విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!!

                                                             



ఒక మహోద్విగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజా రాజధాని అమరావతికి పునాదిరాయి పడింది. విజయదశమి శుభదినాన విజయోస్తు అంటూ ఆశీస్సులు అందాయి. ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది. అమరావతి విశ్వరాజధానిగా వెలుగొందుతుంది. విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!! తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Monday, 14 September 2015

ఇప్పుడు వరి వద్దు.. ఆరుతడే ముద్దు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వేసిన పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయి. కానీ ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కళ తప్పింది. పంటల సాగు రెండు రాష్ట్రాల్లో మూడువంతులే సాధ్యపడింది. సీజన్‌ గతి తప్పినా వరి వేయాలనేదే చాలా మంది ఆలోచన. నిజానికి ఇప్పుడు వరి వేస్తే దిగుబడులపై ప్రభావం చూపడం ఖాయం. స్థానిక పరిస్థితుల కారణంగా వరికి బదులు ముందస్తు రబీకి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
                     నోట్‌: ప్రచురించిన వ్యాసంలోని పట్టికను లక్షల ఎకరాలకు బదులు హెక్టార్లుగా భావించగలరు
                                                                           




from జైకిసాన్ http://ift.tt/1LdwrDZ

ఆరుతడి పంటలే శరణ్యం!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వేసిన పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయి. కానీ ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కళ తప్పింది. పంటల సాగు రెండు రాష్ట్రాల్లో మూడువంతులే సాధ్యపడింది. సీజన్‌ గతి తప్పినా వరి వేయాలనేదే చాలా మంది ఆలోచన. నిజానికి ఇప్పుడు వరి వేస్తే దిగుబడులపై ప్రభావం చూపడం ఖాయం. స్థానిక పరిస్థితుల కారణంగా వరికి బదులు ముందస్తు రబీకి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది
                     నోట్‌: ప్రచురించిన వ్యాసంలోని పట్టికను లక్షల ఎకరాలకు బదులు హెక్టార్లుగా భావించగలరు