from జైకిసాన్ http://ift.tt/2B0tXGM
Sunday, 14 January 2018
Saturday, 13 January 2018
భోగి శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు భోగ భాగ్యాలు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ...భోగి పండుగ శుభాకాంక్షలు. అమిర్నేని హరికృష్ణ
🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹
from జైకిసాన్ http://ift.tt/2AWQzYR
Tuesday, 9 January 2018
కొబ్బరిపీచు యూనిట్-ఆదాయఅవకాశాలు
కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగం తిరిగి మనకు ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, ఖమ్మం తదితర కొబ్బరిని బాగా పండించే ప్రాంతాలలో కొబ్బరిపీచు తయారీ యూనిట్‌ను రైతు సంఘాల స్థాయిలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాలపై రాసిన నా వ్యాసం జనవరి " అన్నదాత " వ్యవసాయ మాసపత్రికలో..!
from జైకిసాన్ http://ift.tt/2CL6B9P
Monday, 8 January 2018
సస్యలక్ష్మీ స్వాగతం
రైతుల పండుగ సంక్రాంతి శోభే వేరు. పల్లెసీమల్లో పంట నూర్పిళ్లు వేగం పుంజుకున్న ఈ తరుణంలో సస్యలక్ష్మిని స్వాగతిస్తూ తెలుగు రాష్ట్రాలలో వరి సాగు స్థితిగతుల గురించి నేను రాసిన వ్యాసం జనవరి 2018 "అన్నదాత" వ్యవసాయ మాసపత్రిక లో..!
from జైకిసాన్ http://ift.tt/2Eo0852
అన్నదాత మాసపత్రిక సరికొత్తగా...
దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వ్యవసాయ మాసపత్రిక "అన్నదాత" జనవరి'18 సంచిక నుంచి రైతులు సరికొత్త మార్పులు చూడవచ్చు. పత్రిక స్వరూపంలో ఎన్నోమార్పులకు నవంబరు నుంచే శ్రీకారం చుట్టాం. అన్నదాత మాసపత్రిక రైతు సేవలో 49 ఏళ్లు నిండి 50 వ పడిలోకి చేరుకున్న సందర్భంగా పాఠకులకు, రైతులకు శుభాకాంక్షలు.
from జైకిసాన్ http://ift.tt/2AEBfzR
Thursday, 7 December 2017
పుట్టగొడుగుల యూనిట్‌తో అదనపు ఆదాయం
పని చేసేవారు ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేరు. ఏదో ఒక ఉపాథి పొందాలనుకునే వారికి ఏం చేయాలో తోచదు. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పొందేలా, ఇంటిపట్టున ఉండి ఆదాయం ఆర్జించేలా గృహిణులకూ ఎన్నో ఆదాయం పొందే అవకాశాలున్నాయి. వాటిల్లో పుట్టగొడుగుల పెంపకం ఒకటి. సూపర్ మార్కెట్లు, మార్కెటింగ్ సంస్ధలు, హోటళ్లతో మాట్లాడుకుని మార్కెట్ చేసుకోగలిగితే వీటి పెంపకం చక్కని ఆదాయ వనరు. డిసెంబరు అన్నదాత లో ఆదాయ వ్యయాలు, నిపుణుల ఫోన్ నెంబర్లతో సహా నా వ్యాసం మీ కోసం...
from జైకిసాన్ http://ift.tt/2B0Caic
Saturday, 11 November 2017
రైతు వ్యాపారిగా మారాలి!
రైతు చేలో తన ఉత్పత్తిని కిలో రూ. 10కి విక్రయిస్తే అది బహిరంగ విపణిలో రూ. 100 పలుకుతోంది. ఐదారు నెలల రైతు కష్టాన్ని వ్యాపారి ఒక్క రోజులో సంపాదిస్తున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల కాలంలో రైతుల ఈ దుస్థితిని సరిచేయలేని పాలకులది ఘోర వైఫల్యం. ప్రభుత్వాలేదో చేస్తాయనే భ్రమలు రైతుకు లేనందువల్ల రైతులు ఐక్యంగా లేదా ఒక్కరుగా కుటీర పరిశ్రమ స్థాయిలో తమ ఉత్పత్తికి విలువ జోడించుకోగలిగితే రెట్టింపు ఆదాయాలు దక్కుతాయి. రైతులిలా మార్కెట్ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
from జైకిసాన్ http://ift.tt/2hmYCXv
Subscribe to:
Posts (Atom)