సేద్యంలో నేడు సగం మంది కౌలుదారులే. వాస్తవ సాగుదారులుగా భూ యజమానులకు అందుతున్న రాయితీలు, రుణాలు, పరిహారాలు కౌలుదార్లకూ దక్కాలి. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు. ఈ చెట్టులోని ప్రతి భాగం తిరిగి మనకు ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, ఖమ్మం తదితర కొబ్బరిని బాగా పండించే ప్రాంతాలలో కొబ్బరిపీచు తయారీ యూనిట్‌ను రైతు సంఘాల స్థాయిలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆదాయ అవకాశాలు ఎలా ఉంటాయనే అంశాలపై రాసిన నా వ్యాసం జనవరి " అన్నదాత " వ్యవసాయ మాసపత్రికలో..!
రైతుల పండుగ సంక్రాంతి శోభే వేరు. పల్లెసీమల్లో పంట నూర్పిళ్లు వేగం పుంజుకున్న ఈ తరుణంలో సస్యలక్ష్మిని స్వాగతిస్తూ తెలుగు రాష్ట్రాలలో వరి సాగు స్థితిగతుల గురించి నేను రాసిన వ్యాసం జనవరి 2018 "అన్నదాత" వ్యవసాయ మాసపత్రిక లో..!
దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వ్యవసాయ మాసపత్రిక "అన్నదాత" జనవరి'18 సంచిక నుంచి రైతులు సరికొత్త మార్పులు చూడవచ్చు. పత్రిక స్వరూపంలో ఎన్నోమార్పులకు నవంబరు నుంచే శ్రీకారం చుట్టాం. అన్నదాత మాసపత్రిక రైతు సేవలో 49 ఏళ్లు నిండి 50 వ పడిలోకి చేరుకున్న సందర్భంగా పాఠకులకు, రైతులకు శుభాకాంక్షలు.
పని చేసేవారు ఎప్పుడూ ఖాళీగా కూర్చోలేరు. ఏదో ఒక ఉపాథి పొందాలనుకునే వారికి ఏం చేయాలో తోచదు. వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం పొందేలా, ఇంటిపట్టున ఉండి ఆదాయం ఆర్జించేలా గృహిణులకూ ఎన్నో ఆదాయం పొందే అవకాశాలున్నాయి. వాటిల్లో పుట్టగొడుగుల పెంపకం ఒకటి. సూపర్ మార్కెట్లు, మార్కెటింగ్ సంస్ధలు, హోటళ్లతో మాట్లాడుకుని మార్కెట్ చేసుకోగలిగితే వీటి పెంపకం చక్కని ఆదాయ వనరు. డిసెంబరు అన్నదాత లో ఆదాయ వ్యయాలు, నిపుణుల ఫోన్ నెంబర్లతో సహా నా వ్యాసం మీ కోసం...