from జైకిసాన్ http://bit.ly/2FrUq62
Saturday, 12 January 2019
Friday, 11 January 2019
అన్నదాత మాసపత్రికకు శ్రీవెంకయ్యనాయుడు గారి ప్రశంసలు
నిలువెత్తు తెలుగు సంతకం, స్ఫూర్తిప్రదాత, భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని ఈ రోజు ఉదయం వారింట్లో కలుసుకున్నాం. అన్నదాత స్వర్ణోత్సవ సంచికను వారికి అందించేందుకు వెళ్లిన సందర్భంలో తీసుకున్న జ్ఞాపకాలివి. దేశంలో మరెవ్వరూ చేయనంతగా రైతుల కోసం రామోజీరావుగారు చేస్తున్న కృషిని వారు అభినందించారు. స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను చాలా ఓపికగా మొత్తం చూసి వ్యవసాయం అనుబంధ రంగాలలో అన్ని ప్రధాన అంశాలను కలబోసి తీసుకువచ్చిన గొప్ప ప్రయత్నంగా కితాబిచ్చారు. ఇటీవల అన్నదాత మేగజైన్‌లో వచ్చిన మార్పులను ప్రస్తావించి ఎంతో చక్కగా వస్తున్నదని ప్రశంసించటం సంతోషం కలిగించింది.
from జైకిసాన్ http://bit.ly/2D44mRi
Friday, 4 January 2019
Thursday, 3 January 2019
అన్నదాత కు స్వర్ణోత్సవం
తెలుగు రైతుల మానస పుత్రిక ' అన్నదాత ' మాసపత్రిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మా చైర్మన్ శ్రీ రామోజీరావు గారు. స్వర్ణోత్సవ సంచికను నా సంపాదకత్వంలో తీసుకువచ్చే అవకాశాన్ని నాకు దక్కించిన రామోజీరావు గారు, ఎం. డీ కిరణ్ గార్లకు నా ధన్యవాదాలు.
from జైకిసాన్ http://bit.ly/2VqsVPH
Friday, 7 December 2018
ఈనాడులో పాతికేళ్ల నా ఉద్యోగ ప్రస్థానం
'ఈనాడు' సంస్థలో నా ఉద్యోగ జీవితానికి నేటితో పాతికేళ్లు పూర్తి. అన్నదాత స్వర్ణోత్సవ సమయంలో నా సర్వీసుకు రజతోత్సవం., అదే సమయంలో ఈటీవీ వార్తా ఛానళ్ల కార్యక్రమాలతో పాటు' అన్నదాత' మాసపత్రిక కు సారధ్యం వహిస్తుండటం మరపురాని అనుభూతి. 1993 జూన్1న ఈనాడు పాత్రికేయ పాఠశాలలో చేరినప్పటికీ ఉప సంపాదకునిగా ఈనాడు నుంచి లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ అందుకుంది డిసెంబరు9, 1993.
నన్ను ఆదరించి నాకు జీవితాన్నిచ్చిన, ఈనాడు గ్రూపులో సమున్నత స్థానం కల్పించిన మా ఛైర్మన్ రామోజీరావు గారికి, ఎండీ కిరణ్ గారికి సదా రుణపడి ఉంటాను. నన్ను ఎంతగానో ప్రోత్సహించిన అట్లూరి రామ్మోహనరావు గారికి, స్వర్గీయ అట్లూరి రామారావు గారికి, స్వర్గీయ చలసాని ప్రసాదరావు గారికి కృతజ్ఞతలు. సంస్థలో నా సీనియర్లు బాపినీడు గారు, ఎం. నాగేశ్వరరావు గారు, డి.ఎన్. ప్రసాద్ గారు, శాస్త్రి గారు, వాసిరెడ్డి నారాయణరావు గారు, రాజేంద్రబాబు గారు, స్వర్గీయ గౌస్ గారు నా సహచరులు అందించిన సహాయ సహకారాలు నేను ఎప్పటికీ మరువలేను. నా పాతికేళ్ళ ప్రస్థానంలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన వారెందరో ఉన్నారు. వాళ్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.
నేను జర్నలిస్ట్ కావడానికి ప్రేరణనిచ్చిన మా మావయ్య, 'ఉద్యోగ విజయాలు' మాసపత్రిక సంపాదకులు ఆలూరి సుభాష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఒక రైతుబిడ్డగా ఆ రైతులకేదో చేయాలనే నా సంకల్పానికి ఊపిరి పోసిన మా మార్గదర్శి శ్రీ రామోజీరావు గారికి పాద ప్రణామాలు.-అమిర్నేని హరికృష్ణ

from జైకిసాన్ https://ift.tt/2B091lg
Wednesday, 5 December 2018
విలువ జోడిస్తేనే సోయా లాభసాటి!
ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో అత్యధికంగా సాగు చేస్తూ., పోషక విలువల పరంగా ఎంతో ప్రాముఖ్యమున్న సోయా పంట లాభసాటి కావడం లేదనేది రైతుల ఆవేదన. సోయాకు విలువ చేకూర్చడంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తే అన్నదాతల ఆదాయం పెరుగుతుందంటున్న నా వ్యాసాన్ని డిసెంబర్ నెల అన్నదాత మాసపత్రిక లో చూడవచ్చు
from జైకిసాన్ https://ift.tt/2SzR7gt
Monday, 3 December 2018
Subscribe to:
Posts (Atom)