from జైకిసాన్ https://ift.tt/39U0HWm
Thursday, 8 April 2021
రైతులంటే అంత చులకనా..?
క్వింటా వరి ధాన్యం పండించేందుకు దాదాపు రూ. 2600 ఖర్చవుతోంది. ప్రకటించిన మద్దతు ధర క్వింటా రూ. 1880 మాత్రమే. నిజానికి ఆ ధరా దక్కదు. ముడి సరుకుల ధరలు పెరిగాయని డిఎపి (డైఅమ్మోనియం ఫాస్పేట్) ధరల్ని ఏకంగా బస్తాకు రూ. 1200 నుంచి 1900 కి (ఒకేసారి రూ. 700) పెంచేసి కంపెనీలకు మేలు చేస్తున్న కేంద్రం, బస్తా ఉత్పత్తి వ్యయానికి తగ్గట్టు మద్దతు ధరలను ఎందుకు పెంచలేకపోతోంది..?
డీజిల్, పెట్రోలు, డిఏపీ, ఇతర ఉత్పాదకాల ధరలు పెంచుతున్నా రైతుకు మాత్రం ఏటా పదో, పాతికో పెంచి ముష్టి వేస్తున్నారా..? కంపెనీలకో న్యాయం..? రైతులకు అన్యాయమా....? ఇదేం చోద్యం. అన్నదాతలంటే అంత చులకనా..?
from జైకిసాన్ https://ift.tt/39U0HWm
Wednesday, 7 April 2021
వంటనూనెల్లో స్వయం సమృద్ధి ఇంకెన్నాళ్లు!
వంటనూనెల ధరలు మండుతున్న నేపథ్యంలో నూనెగింజల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచే దిశగా స్వయం సమృద్ధి సాధించేందుు పటిష్ట కార్యాచరణను రూపొందించాల్సన అవసరాన్ని గుర్తు చేస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
from జైకిసాన్ https://ift.tt/3fT94p8
Friday, 2 April 2021
విటమిన్లు ఇచ్చే అన్నం
వరి, గోధుమల్లో విటమిన్ డి, ఎ, సి లు లభించేలా పోషకాలను పెంపొందించే మిశ్రమాన్ని రూపొందించి, పేటెంట్ కూడా పొందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి కృషి గురించి నేను రాసిన వ్యాసం.. అన్నదాత మాసపత్రిక ఏప్రిల్ 2021 సంచికలో
from జైకిసాన్ https://ift.tt/39BofiG
Wednesday, 31 March 2021
Sunday, 7 March 2021
మహిళా నీకు వందనం
ఆమె లేని జీవితం అసంపూర్ణం.
ఆమె లేకపోయినా మేమున్నామని అనుకోవడం పురుష అహంకారం.
ఆమె తోనే సర్వం శుభప్రదం!
ఏడాదికో రోజు మాత్రమే మిమ్మల్ని తలవడం ఏమిటి..?
మీరు లేని, మిమ్మల్ని తలవని ఏ ఒక్క రోజును ఊహించలేం..
మహిళా నీకు వందనం!
సమస్త నారీ లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో...
from జైకిసాన్ https://ift.tt/3kSDw37
Saturday, 6 March 2021
ఖండాంతర ఖ్యాతి.. ఒంగోలు జాతి
తెలుగు వారికి గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులు ఖండాంతర ఖ్యాతిని పొందినా స్వదేశంలో కనుమరుగవుతున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మాసపత్రిక మార్చి 2021 సంచికలో ప్రచురించింది.
from జైకిసాన్ https://ift.tt/3sZ70PJ
Wednesday, 3 March 2021
Subscribe to:
Posts (Atom)












