మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
-అమిర్నేని హరికృష్ణ
from జైకిసాన్ https://ift.tt/3lFGsCc
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
-అమిర్నేని హరికృష్ణ
మన దేశం వ్యవసాయకంగా ఎంతో పురోగమించింది కానీ సాగుదార్లు మాత్రం నేటికీ సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. దీనిపై నేను రాసిన వ్యాసం అన్నదాత అక్టోబరు 2021 సంచికలో ప్రచురితమైంది.
పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో డీజిలుకు ప్రత్యామ్నాయంగా బయోగ్యాస్ ను ఉపయోగించి సిబిజి, సిఎన్ జి తయారీ నేడు ఉపందుకుంటోంది. వీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్లకు సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ రాయితీలు అందిస్తోంది. రైతు స్థాయి నుంచి డీజిల్ ఉత్పత్తి వరకు వ్యర్ధాలకు కొత్త అర్ధం చెప్పే బయోగ్యాస్ ఉపయోగాల గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పధకాన్ని తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదు. వాటాల విషయంలో పట్టు విడుపులకు పోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేయాల్సిన పధకం ఇలా నీరుగారుతుండటం వల్ల విపత్తులు సంభవించినప్పుడల్లా రైతులకు బీమా ధీమా కల్పించలేకపోతోంది. ఈ అంశంపై సెప్టెంబరు అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైన నా వ్యాసమిది.