అన్నదాత మే 2022 సంచిక కవర్ పేజి, సంపాదకీయం.
from జైకిసాన్ https://ift.tt/AtElYR1
రష్యా -ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో పెట్రో ధరలకు తోడు వంట నూనెల ధరలు పెరిగిపోవడం సామాన్యుడిపై పెను భారం పడుతోంది. నూనె గింజల సాగులో స్వయం సమృద్ధి సాధించే దిశగా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
సాగునీటి సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగి అవి నిర్వీర్యమయ్యాక, నిధుల కొరతతోనూ కాలువల మరమ్మతులు సాగక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల భాగస్వామ్యంతో సమర్ధ నీటి యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత ఏప్రిల్ 2022 సంచిక ప్రచురించింది.
రైతుల నెలసరి సంపాదన కింది స్ధాయి ఉద్యోగి కంటే ఘోరంగా ఉంది. వ్యవసాయం వృద్ధి చెందుతోంది కానీ ఆ సేద్యాన్ని నమ్ముకున్న రైతులు మాత్రం సరిపడ ఆదాయం లేక చితికి పోతున్నారు. రెట్టింపు ఆదాయం మాట దేవుడెరుగు., కొండల్లా పెరిగిన అప్పులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులపై నేను రాసిన ప్రత్యేక వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
సెంటు భూమిలేని కౌలు రైతులకు సేద్యం భారంగా మారుతోంది. ఎన్ని కొత్త చట్టాలు చేసినా భూయజమానులతో సమానంగా పంట రుణాలు సహా ఉత్పాదకాలు అందకపోతుండడంతో లక్షలాదిమంది కౌలుదార్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
వ్యవసాయంపై శ్రద్ధ పెట్టకుండా రైతు సంక్షేమం ఎలా వెల్లివిరిస్తుంది..? చేయూతనిస్తేనే సేద్యంపై రైతులకు భరోసా పెరుగుతుందంటూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత మార్చి 2022 సంచిక ప్రచురించింది.