కోళ్ల రైతుల ఆత్మబంధువు డా. సుందరనాయుడు గారికి నివాళిగా అన్నదాత జూన్ 2022 సంచికలో రాసిన నా వ్యాసం.
from జైకిసాన్ https://ift.tt/AcaF0CW
కోళ్ల రైతుల ఆత్మబంధువు డా. సుందరనాయుడు గారికి నివాళిగా అన్నదాత జూన్ 2022 సంచికలో రాసిన నా వ్యాసం.
నిస్సారమైన ఆహారం, మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం తెస్తున్న సమస్యలతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఈ తరుణంలో పోషకవిలువలు అధికంగా చిరుధాన్యాల వాడకాన్ని పెంచాలంటూ నేను రాసిన వ్యాసం అన్నదాత మే సంచికలో ప్రచురితమైంది.
రష్యా -ఉక్రెయిన్ యుద్ధంతో దేశంలో పెట్రో ధరలకు తోడు వంట నూనెల ధరలు పెరిగిపోవడం సామాన్యుడిపై పెను భారం పడుతోంది. నూనె గింజల సాగులో స్వయం సమృద్ధి సాధించే దిశగా వేగంగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
సాగునీటి సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగి అవి నిర్వీర్యమయ్యాక, నిధుల కొరతతోనూ కాలువల మరమ్మతులు సాగక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల భాగస్వామ్యంతో సమర్ధ నీటి యాజమాన్యాన్ని చేపట్టాల్సిన అవసరాన్ని చెబుతూ నేను రాసిన వ్యాసాన్ని అన్నదాత ఏప్రిల్ 2022 సంచిక ప్రచురించింది.
రైతుల నెలసరి సంపాదన కింది స్ధాయి ఉద్యోగి కంటే ఘోరంగా ఉంది. వ్యవసాయం వృద్ధి చెందుతోంది కానీ ఆ సేద్యాన్ని నమ్ముకున్న రైతులు మాత్రం సరిపడ ఆదాయం లేక చితికి పోతున్నారు. రెట్టింపు ఆదాయం మాట దేవుడెరుగు., కొండల్లా పెరిగిన అప్పులతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులపై నేను రాసిన ప్రత్యేక వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.