సెప్టెంబరు 2022 అన్నదాత మాసపత్రిక కవర్ పేజీ, సంపాదకీయం.
from జైకిసాన్ https://ift.tt/UNo8S2W
అత్యాధునిక సాంకేతికత ఆలంబనగా సాగే రేపటి వ్యవసాయంలో మనం నిలవాలంటే ముందు సగటు రైతుల పరిస్థితిని చక్కదిద్దాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్న పరిస్థితుల్లో అంకుర సంస్ధలు సాంకేతికతను పల్లెల ముంగిటకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది.
విద్యుదుత్పత్తికి బొగ్గు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విధిగా దిగుమతులు చేసుకోవాలని కేంద్రం షరతులు విధిస్తున్న తరుణంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురు సాగుకు నేడు మంచి అవకాశం ఉంది. వెదురు ఆధారిత బయోమాస్ పెల్లెట్లు బొగ్గుకు సరైన ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం గుర్తించింది. ఈ తరుణంలో వెదురు సాగుకున్న అవకాశాలపై నేను రాసిన వ్యాసం అన్నదాత ఆగస్టు 2022 సంచికలో ప్రచురితమైంది.
దేశంలో పలు దశాబ్దాలుగాఅమలవుతున్న పంటల బీమా పధకాలు రైతులకు ఎలాంటి రక్షణ కల్పించలేక పోతున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫసల్ బీమా మెరుగైనదే అయినా ఇందులోని లోటుపాట్లను సవరించడానికి, వాటాల చెల్లింపు విషయంలో తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించడం లేదంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, మద్దతు ధరలు దక్కకపోవడం,వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల సేద్యం నష్టాలను పంచుతోంది. ఈ తరుణంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవచ్చంటూ నేను రాసిన వ్యాసాన్ని "అన్నదాత జూలై 2022 మాసపత్రిక ప్రచురించింది.