నా ఆరాధ్య దైవం షిర్డీ సాయి పై "సాయి స్వరార్చన" పాటల సీడీని విడుదల చేశాక
రెండేళ్లకు ఆదిశంకరునిపై పాటలు రాసే మహద్భాగ్యం లభించింది. గతేడాది
శ్రీశైలం వెళ్ళినప్పుడు నేను తీసుకురావాలనుకున్న సీడీలో శ్రీగిరిలో వెలిసిన
మల్లన్న పై ఒక పాట తప్పనిసరిగా ఉండాలనుకున్నాను. ఆ శంకరుని అనుగ్రహంతో,
మిత్రుడు వెంకటేశ్వరరావు అందించిన సహకారంతో మహాశివుని పై ఆరు పాటలు రాసిన
"శివగీతార్చన" సీడీని నిన్న శనివారం శ్రీశైలంలో శంకరునికి సమర్పించడం
జరిగింది. శివునికి రుద్రాభిషేకం చేయించి అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు
వచ్చే సరికి ఆలయం మైకు నుంచి వినిపిస్తున్న నా పాటలు ఎంతో సంతృప్తిని
మిగిల్చాయి.
Sunday, 30 June 2013
Friday, 14 June 2013
కడగండ్ల ఏరువాక
సకాలంలో వర్షాలు కురిసినా విత్తనాలు దొరక్క రైతులు నానా అగచాట్లు
పడుతున్నారు . సర్వం సిద్ధం చేశామంటున్నవ్యవసాయశాఖ క్షేత్ర స్థాయిలో రైతులు
ఏటా ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని చూపలేక పోతోంది. సీజన్
ముంగిట రైతుకు విత్తన సమస్యలు మామూలు అవుతున్నా సర్కారులో సర్కారులో చలనం
లేదు. పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలోనూ రైతుకు పంట ఉత్పాదకాలను
సకాలంలో అందించడం ద్వారా వారికి మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించటం లేదు.
ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేసి
చెప్పినా రైతులు దుక్కులు దున్నే నాటికి విత్తనాలు సిద్దం చేయాల్సిన
సర్కారు యెంత సన్నద్ధంగా ఉందో., నేడు రాష్ట్రంలో విత్తనాల కోసం రైతులు
పడుతున్న పాట్లను చూస్తే తెలుస్తుంది. రైతు శ్రేయం విషయంలో ఎప్పుడూ మొద్దు
నిద్ర పోయే ప్రభుత్వాలకు అన్నదాతల కష్టాలు కనిపిస్తున్నాయా...?
Saturday, 11 May 2013
కార్పొరేట్ సేద్యం - సర్కారు చోద్యం!
సదుపాయాలు కల్పించకుండా చిన్న రైతులు సేద్యంలో లాభాపడలేక పోతున్నారంటూ కార్పొరేట్ వ్యవసాయానికి ద్వారాలు తెరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైతుకు ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించుకునేందుకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా కార్పొరేట్ సంస్థలతో వ్యవసాయ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇక్కడ కార్పొరేట్ వ్యవసాయాన్ని స్వాగతించాలా వద్దా అనే సంగతిని పక్కన పెడితే రైతుకు రక్షణ కల్పించే ఆంశాలను ఈ ఒప్పందాల్లో ఎందుకు పొందు పరచలేదన్నదే ఇక్కడ ప్రశ్న. కార్పొరేట్ వ్యవసాయ విధానంలో రైతు ప్రయోజనాలను విస్మరించిన ఆంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు "ఈనాడు" ప్రచురించింది. మీ కోసం ఈ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Thursday, 25 April 2013
కళ్ళు తెరవాల్సింది పాలకులే..!
ప్రభుత్వం మీ కోసం లక్ష లోపు రుణాలకు వడ్డీ మాఫీ చేసింది., ఈసారి పనిముట్లకు ఇటువంటి రాయితీలు ఇస్తాం, ఎరువులు కొరత లేకుండా చూస్తాం., విత్తనాలకు కొరత రానీయకుండా చూస్తాం....... రైతు చైతన్య యాత్రల్లో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పెంచుతున్న అవగాహన ఇది. వాస్తవానికి రైతులకు అవగాహన పెంచాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సంక్షోభంలో ఉన్న సేధ్యరంగాన్ని గట్టెక్కించాలంటే రైతులకు మార్కెట్ తెలివిడిని పెంచే చర్యలు చేపట్టాలి. ఈ ఏడాది ఏయే పంటలకు గిరాకీ ఉంది.? ఏయే పంటలను ఎంతెంత విస్తీర్ణంలో సాగు చెయాలి...? మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఏ సమయంలో పంటను మార్కెట్ కు తీసుకువెళితే రైతుకు మంచి ధర వస్తుంది ...? ఒకవేళ ధర లేకపోతే ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది... ? మంచి ధరలు ఎలానూ ఇవ్వలేని ప్రభుత్వం చైతన్య యాత్రల్లో రైతుకు నేర్పాల్సినవి ఇవే...! ఇవన్నీ వదిలిపెట్టి రెండు వేల కోట్ల ప్రజాధనాన్ని యాత్రల పేరిట ఈ జాతరకు ఖర్చు చేస్తుండటం సిగ్గుచేటు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఆ వ్యాసాన్ని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.
Sunday, 21 April 2013
Thursday, 18 April 2013
శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు సదా పూజ్యనీయుడు. అత్యున్నత వ్యక్తిత్వంలోని స్పూర్తిమత్వాన్ని మనం రాముడులోనే చూస్తాం. ధర్మవర్తనుడుగా నిలవటమే కాకుండా విశిష్ట లక్షణాలతో సకల సద్గుణాల కలబోసిన వ్యక్తి కనుకే రాముడు జగదబిరాముడు అయ్యాడు. ఏకపత్నీవ్రతంతో చరించి విశ్వజనానికి మార్గదర్శకుడుగా నిలిచాడు. అటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వం నుంచి నేర్చుకోవడమే మానవాళికి నిజమైన వికాసం. మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Thursday, 11 April 2013
శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
చైత్ర శుద్ధ పాడ్యమి నాడు తెలుగువారు జరుపుకునే పండుగే యుగాది ఉగాది. తొలి సంవత్సరాదిగా తెలుగు ప్రజలు వ్యవహరించే ఈ పండుగ రోజు ఉదయాన్నే పూజ చేసి షడ్రుచులు కలబోసిన ఉగాది పచ్చడిని సేవించడం మన సంప్రదాయం. వసంత నవరాత్రులు ఆరంభమయ్యే ఈ శుభదినం నుంచి ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సకల జనావళికి శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
Subscribe to:
Posts (Atom)









