Tuesday, 20 March 2018

లోపాలపుట్ట-పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ ముసాయిదా బిల్లు

పంటకు చీడపీడలు ఆశిస్తే ఏ మందును ఎంత మేరకు చల్లాలనేది 90 శాతం మంది రైతులకు తెలియదు. అది చెప్సాల్సిన విస్తరణ యంత్రాంగం ఉండదు. డీలర్లు ఏం ఇస్తే అది తెచ్చి చల్లుతున్నారు. వాళ్ల కమీషన్లు వాళ్లకు వస్తాయి. రైతు జేబులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా కేంద్రం రూపొందించిన "పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు-2017" ముసాయిదా సైతం లోపభూయిష్టంగా ఉంది. రెట్టింపు ఆదాయం రావాలంటే ముందు రైతులు ఖర్చులు తగ్గించుకోవాలి. రైతుల్ని ఉద్ధరిస్తామంటూ పాలకులు బడాయి ప్రకటనలు చేయడం తప్ప అన్నదాతకు మేలు చేసేలా చట్టాలకు పదును పెట్టకపోవడం వంటి చర్యలు వారి డొల్లతనాన్నిచెబుతున్నాయి. లోపాలపుట్టగా ఉన్న ఈ ముసాయిదా బిల్లు గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 
                                                                      



from జైకిసాన్ http://ift.tt/2HQ4eVp

Tuesday, 6 March 2018

రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే..!

కేంద్రప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని భావిస్తోంది. అందుకు ముందుగా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలకు తగిన పరిష్కారాలు చూపాల్సి ఉంది. ఈ దిశగా కేంద్రం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించలేదు. రైతు ఆదాయాం రెట్టింపు కావాలంటే ఏం చేయాలో సూచిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. 
                                                                             



from జైకిసాన్ http://ift.tt/2oSWV7g

Friday, 23 February 2018

రైతుబిడ్డ మన రమణ

                                                               

రైతు సమస్యలను దగ్గరగా పరిశీలించి, ఒక కార్యకర్తగా ఎన్నో గ్రామాలు తిరిగి., సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేసిన రైతుబిడ్డ రమణ ఆకుల డిప్యూటీ కలెక్టర్‌ కాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ -1 2011 ఫలితాల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన రమణకు శుభాభినందనలు. జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా అన్నదాతలకు చేతనైనంత సాయం చేస్తానంటున్న రమణకు ఆల్‌ ది బెస్ట్‌.


from జైకిసాన్ http://ift.tt/2HFfpkf

Sunday, 11 February 2018

విలువ జోడిస్తేనే లాభం!

విలువ జోడిస్తేనే  నిమ్మ రైతుకు మంచి లాభాలు అందుతాయంటూ నేను రాసిన వ్యాసం ఫిబ్రవరి అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైంది. మీ కోసం.....
                                                                                




from జైకిసాన్ http://ift.tt/2nT4BXC

Saturday, 3 February 2018

పల్లెరాగం.. సేద్యగానం

సాగుదార్ల ఆదాయాలు పెంచే దిశగా ఈసారి జైట్లీ బడ్జెట్‌ కొంత కసరత్తు చేసింది. అంతర్లీనంగా ఉత్పాదకతను తద్వరా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు దృష్టి పెట్టింది. ఈ అంశాలను విశ్లేషిస్తూ కేంద్రబడ్జెట్లో వ్యవసాయరంగ కేటాయింపులపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది.
                                                                         



from జైకిసాన్ http://ift.tt/2nECEll

Sunday, 21 January 2018

పొలాల్లో అంకురిస్తున్న అద్భుతాలు

ఇజ్రాయెల్ వ్యవసాయ సాంకేతిక అద్భుతాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు నేడు ప్రచురించింది.  
                                      


from జైకిసాన్ http://ift.tt/2DlcACl