Wednesday, 12 September 2018

వినాయక చవితి శుభాకాంక్షలు

హితులు, శ్రేయోభిలాషులు, బ్లాగర్లు, మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు తలపెట్టిన  పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను.


from జైకిసాన్ https://ift.tt/2MoYROI

Saturday, 8 September 2018

డెయిరీ ఫారం పెట్టాలనుకుంటున్నారా?

డెయిరీ ఫారం పెట్టాలనుకుంటున్నారా?  అయితే ఈ పోస్టు ఖచ్చితంగా మీ కోసమే!  చక్కని ఉపాధి అవకాశమైన డెయిరీ ఫారం ను 100 గేదెలు లేదా ఆవులతో ప్రారంభిస్తే అయ్యే ఖర్చులు, ఆదాయం వివరాలతో కూడిన నా వ్యాసాన్ని సెప్టెంబరు నెల "అన్నదాత" మాసపత్రిక ప్రచురించింది. మీ కోసం.....





from జైకిసాన్ https://ift.tt/2oOJqpw

Saturday, 18 August 2018

గొర్రెల పెంపకం ప్రాజెక్టు రిపోర్టు

సేద్యానికి అనువుగా లేని ప్రాంతాలలో గొర్రెల పెంపకాన్ని వాణిజ్య సరళిలో చేపట్టడం లాభసాటి. పంటల సాగుకు అనుబంధంగా చేపట్టే ఇలాంటి వ్యాపకాల వల్ల రైతులు స్థిరమైన ఆదాయాలను అందుకోగలుగుతారు. ఒక వంద గొర్రెలతో పెంపకం చేపడితే వచ్చే ఆదాయ వ్యయాల ప్రాజెక్టు రిపోర్టుతో పాటు ఇతర వివరాలతో కూడిన వ్యాసాన్ని ఆగస్టు నెల "అన్నదాత" మాసపత్రిక ప్రచురించింది.
                                                                       




from జైకిసాన్ https://ift.tt/2PlH0Ls

Monday, 13 August 2018

నైపుణ్యం పెరిగితేనే సాగులో ప్రగతి

నేలల్లో రకాలున్నా అందరూ పండించేది అదే నేలపై. కొందరు రైతులు తెలివిగా సేద్యంలో లాభాలు రాబట్టుకుంటుంటే., అధిక శాతం మంది కడగండ్లను ఎదుర్కొంటున్నారు. సేద్యంలో నైపుణ్యాలను పెంచుకుంటూ సేద్యాన్ని ఒక వ్యాపకంగా కాకుండా వ్యాపారంలా చేయగలుగుతున్న వాళ్లను విజయాలు వరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వాల చేయూత లోపం, మార్కెట్‌ శక్తుల ప్రాబల్యం ఇవన్నీ రైతుల్ని నిర్వీర్యం చేస్తున్నాయి. నైపుణ్యం పెరిగితేనే సాగులో ప్రగతి సాధ్యపడుతుంది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలా చేపట్టి నైపుణ్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుతాయంటున్న నా వ్యాపాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.



from జైకిసాన్ https://ift.tt/2MlBN7C

Tuesday, 10 July 2018

అరటి ఆసాంతం ఉపయోగమే..!

గతంలో అరటి చెట్టును గెలలు కోశాక బోదెల్ని పారవేసేవారు. అవన్నీ వ్యర్ధాలుగా మిగిలిపోయేవి. ఒక దశాబ్ద కాలంగా అరటి బోదెల్ని ఉపయోగించి ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం ఇలాంటి ఉత్పత్తులు తయారు చేసే వారికి సాంకేతికంగా ఎంతో సహాయం అందిస్తోంది. యువతరంతో పాటు స్వయం సహాయక బృందాల మహిళలు, రైతులు అదనపు అదాయం కోసం వీటిని ఏర్పాటు చేసుకుని లాభపడ వచ్చనే సమాచారంతో ఈ నెల అన్నదాతలో ఒక వ్యాసం రాశాను.
                                                                     




from జైకిసాన్ https://ift.tt/2um4uX6

Friday, 22 June 2018

పుట్లు పండించే విత్తులేవీ?

ఎన్నో పంటల్లో మనం అధికోత్పత్తులు సాధిస్తున్నాం. కానీ పంటల సగటు ఉత్పాదకత పెరగడం లేదు. ఫలితంగా రైతుకు స్ధిరమైన నికరాదాయం దక్కడం లేదు.  ఉత్పత్తితోపాటు ఉత్పాదకతను గణనీయంగా పెంచే  దిశగా మరింత పరిశోధనలు జరగాలి. అధికోత్పత్తులను అందించే విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలి. ఖరీఫ్ సీజన్‌ ఆరంభమైన తరుణంలో అధిక దిగుబడులు అందించే విత్తనాల అందుబాటు, విత్తన చట్టాలు పటిష్టంగా లేకపోవడం వంటి అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు   ఈనాడు ప్రచురించింది.
                                                                  



from జైకిసాన్ https://ift.tt/2tkROjf

Thursday, 7 June 2018

సాగు సాంకేతికతకు ఇజ్రాయెల్‌ నగిషీలు

ప్రపంచ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక ప్రదర్శనల వల్ల అత్యాధునిక విషయాలు తెలుస్తుంటాయి. సరికొత్త పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికత, సరికొత్త యంత్రాలు... ఇలా ఆధునిక సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది గత నెలలో ఇజ్రాయెల్‌లో జరిగిన ప్రపంచ వ్యవసాయ సదస్సు, ప్రదర్శన. దీనిపై నేను రాసిన వ్యాసాన్ని జూలై నెల అన్నదాత మాసపత్రిక ప్రచురించింది.
                                                                       



from జైకిసాన్ https://ift.tt/2Jr5akd