వ్యవసాయ పరిశోధనలు మందగించడం, విస్తరణ సేవలు రైతులకు అందకపోవడంతో పంటల సాగులో రైతుకు మిగులుబాటు ఉండటం లేదు. ఇందుకు దారితీస్తున్న పరిస్థితులపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
ఏటా సీజన్ కు ముందు నకిలీ, నాసిరకం విత్తనాలతో ఎందరో రైతులు పెట్టుబడులతో పాటు ఒక్కోసారి సర్వస్వం కోల్పోవాల్సి వస్తోంది. రైతు సంఘాల స్థాయిలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోగలిగితే విత్తన సమస్యను చాలా వరకు నివారించవచ్చు. వీటి ఏర్పాటుకున్న అవకాశాల గురించి నేను రాసిన వ్యాసం ఫిబ్రవరి "అన్నదాత" మాసపత్రికలో ప్రచురితమైంది.
మా చైర్మన్ శ్రీ రామోజీరావు గారు, ఎండీ కిరణ్ గార్లతో ఇక్రిశాట్ డిజిటల్ శాస్త్రవేత్తల బృందం సమావేశం. ఈటీవీ భారత్ ద్వారా వ్యవసాయానికి డిజిటల్ పరిజ్ఞానాన్ని జోడించి రైతులకు సేవలందించే దిశగా చేస్తున్న ప్రయత్నామిది.
నిలువెత్తు తెలుగు సంతకం, స్ఫూర్తిప్రదాత, భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని ఈ రోజు ఉదయం వారింట్లో కలుసుకున్నాం. అన్నదాత స్వర్ణోత్సవ సంచికను వారికి అందించేందుకు వెళ్లిన సందర్భంలో తీసుకున్న జ్ఞాపకాలివి. దేశంలో మరెవ్వరూ చేయనంతగా రైతుల కోసం రామోజీరావుగారు చేస్తున్న కృషిని వారు అభినందించారు. స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను చాలా ఓపికగా మొత్తం చూసి వ్యవసాయం అనుబంధ రంగాలలో అన్ని ప్రధాన అంశాలను కలబోసి తీసుకువచ్చిన గొప్ప ప్రయత్నంగా కితాబిచ్చారు. ఇటీవల అన్నదాత మేగజైన్‌లో వచ్చిన మార్పులను ప్రస్తావించి ఎంతో చక్కగా వస్తున్నదని ప్రశంసించటం సంతోషం కలిగించింది.