Friday 20 March 2015

ఉగాది మీడియా పురస్కారం

                                                               
     
హైదరాబాద్ చెందిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారు సంయుక్తంగా ఈ ఏడాది  "ఉగాది మీడియా పురస్కారం" కు నన్ను ఎంపిక చేసినట్టు ఫోన్ చేసి చెప్పారు. ఆహ్వానం పంపించారు. సుదీర్ఘకాలం మీడియా లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు, మీడియా ఎడిటర్లకు ఈ అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎన్ టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావులకు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. నాతొ పాటు ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైయెస్సార్ శర్మ, సూర్య ఎడిటర్ సత్యమూర్తి, ప్రజాశక్తి ఎడిటర్ ఎస్. వీరయ్య, కళ పత్రిక ఎడిటర్ మహమ్మద్ రఫీ, అంకం రవి (వీ6 ఛానల్ ) క్రాంతి కిరణ్ (జై తెలంగాణ టీవీ ), హరిప్రసాద్ (టీవీ9), ఈశ్వర్ (6టీవీ), సాయి (జెమిని న్యూస్)లు  కూడా ఉగాది మీడియా పురస్కారాలు అందుకోనున్నారు.
అయితే  రవీంద్రభారతి లో  అవార్డు తీసుకోవాల్సిన 23వ తేదీన  నేను తిరుమలలో ఉండాల్సిన కారణంగా ఈ అవార్డును నేను స్వయంగా స్వీకరించలేకపోతున్నట్టు  నిర్వాహకులకు తెలిపాను. నా తరపున సహచరుడు మధుసూధనాచారి ఈ అవార్డును స్వీకరిస్తారు. నా మిత్రులు, మరికొందరు సీనియర్ జర్నలిస్టు మిత్రులను ఈ సందర్భంగా కలుసుకోలేక పోతున్నందుకు కొంత బాధగానూ ఉంది.  నాకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి, జేబీ రాజు ఫౌండేషన్ వారికి నా కృతజ్ఞతలు.
                                                                  

No comments: