Thursday 31 December 2015

కర్షకరత్న పురస్కారం

మీ అందరి ఆశీస్సులతో ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజు కర్షకరత్న పురస్కారం అందుకోబోతున్నాను. మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావుతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 108 ఆదర్శ రైతులు, రైతు బాంధవులకు రేపు ఉదయం 9 గంటకు మియాపూర్‌లోని శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఈ పురస్కారాలు ఇచ్చి సత్కరించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
మియాపూర్‌లోని శ్రీధర్మపురి క్షేత్ర ట్రస్టు బో్ర్డు వారు, భారతీయం సంస్ధ నిర్వాహకులు శ్రీమతి గొట్టిపాటి సత్యవాణి, జాతీయ ఆదర్శ రైతు గుడివాడ నాగరత్నం నాయుడుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారికి కోటి వరి కంకులతో పూజ చేస్తారు. రైతు ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సీనియర్‌ జర్నలిస్టుగా నాకీ పురస్కారం అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వారికి నా ధన్యవాదాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

from జైకిసాన్ http://ift.tt/1RSKFha

Tuesday 10 November 2015

దీపావళి శుభాకాంక్షలు

ఈ ఆనందాల శుభవేళ...
హితులు, సన్నిహితులు..
మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
 
from జైకిసాన్ http://ift.tt/1HGR8mE

దీపావళి శుభాకాంక్షలు

ఈ ఆనందాల శుభవేళ...
హితులు, సన్నిహితులు, మిత్రులందరికీ...
దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

Thursday 22 October 2015

విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!!

ఒక మహోద్విగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజా రాజధాని అమరావతికి పునాదిరాయి పడింది. విజయదశమి శుభదినాన విజయోస్తు అంటూ ఆశీస్సులు అందాయి. ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది. అమరావతి విశ్వరాజధానిగా వెలుగొందుతుంది. విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!! తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

from జైకిసాన్ http://ift.tt/1Np8Cbq

విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!!

ఒక మహోద్విగ్న ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజా రాజధాని అమరావతికి పునాదిరాయి పడింది. విజయదశమి శుభదినాన విజయోస్తు అంటూ ఆశీస్సులు అందాయి. ఇక అందరి స్వప్నం సాకారమవుతుంది. అమరావతి విశ్వరాజధానిగా వెలుగొందుతుంది. విజయోస‌్తు..! దిగ్విజయోస్తు!! తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

Monday 14 September 2015

ఇప్పుడు వరి వద్దు.. ఆరుతడే ముద్దు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వేసిన పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయి. కానీ ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కళ తప్పింది. పంటల సాగు రెండు రాష్ట్రాల్లో మూడువంతులే సాధ్యపడింది. సీజన్‌ గతి తప్పినా వరి వేయాలనేదే చాలా మంది ఆలోచన. నిజానికి ఇప్పుడు వరి వేస్తే దిగుబడులపై ప్రభావం చూపడం ఖాయం. స్థానిక పరిస్థితుల కారణంగా వరికి బదులు ముందస్తు రబీకి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది.
                     నోట్‌: ప్రచురించిన వ్యాసంలోని పట్టికను లక్షల ఎకరాలకు బదులు హెక్టార్లుగా భావించగలరు
                                                                           
from జైకిసాన్ http://ift.tt/1LdwrDZ

ఆరుతడి పంటలే శరణ్యం!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడుతున్నాయి. వేసిన పంటలకు ఈ వర్షాలు జీవం పోస్తాయి. కానీ ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కళ తప్పింది. పంటల సాగు రెండు రాష్ట్రాల్లో మూడువంతులే సాధ్యపడింది. సీజన్‌ గతి తప్పినా వరి వేయాలనేదే చాలా మంది ఆలోచన. నిజానికి ఇప్పుడు వరి వేస్తే దిగుబడులపై ప్రభావం చూపడం ఖాయం. స్థానిక పరిస్థితుల కారణంగా వరికి బదులు ముందస్తు రబీకి ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచిస్తున్న నా వ్యాసాన్ని ఈరోజు ఈనాడు ప్రచురించింది
                     నోట్‌: ప్రచురించిన వ్యాసంలోని పట్టికను లక్షల ఎకరాలకు బదులు హెక్టార్లుగా భావించగలరు
                                                                          
Sunday 30 August 2015

పేదింట్లో ఉడకని పప్పులు!

కిలో కందిపప్పు రూ.150., కిలో మినపగుండ్లు రూ.140.,సామాన్యుడికి పోషకాహారాన్ని అందించే పప్పుధాన్యాల ధరలిలా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంటే ద్రవ్యోల్భణం అత్యల్ప స్థాయిలో ఉందనేది ఏలినవారి మాట. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ధరల మధ్య సమన్వయం సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా దిగుమతులతో చేతిచమురు వదిలించుకుంటోందే తప్ప ఆయా పంటలు సాగు చేస్తున్న మెట్ట రైతులకు చేయూతను అందించడం లేదని విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్‌ లోడ్‌ చేస్తున్నాను
                                                                                 
from జైకిసాన్ http://ift.tt/1fQkUxl

ఆహారభద్రత ఎండమావేనా..?

కిలో కందిపప్పు రూ.150., కిలో మినపగుండ్లు రూ.140.,సామాన్యుడికి పోషకాహారాన్ని అందించే పప్పుధాన్యాల ధరలిలా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోంటే ద్రవ్యోల్భణం అత్యల్ప స్థాయిలో ఉందనేది ఏలినవారి మాట. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, ధరల మధ్య సమన్వయం సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోంది. ఏళ్లు గడుస్తున్నా దిగుమతులతో చేతిచమురు వదిలించుకుంటోందే తప్ప ఆయా పంటలు సాగు చేస్తున్న మెట్ట రైతులకు చేయూతను అందించడం లేదని విశ్లేషించిన నా వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్‌ లోడ్‌ చేస్తున్నాను
                                                                       
Wednesday 22 July 2015

విపత్తుల నుంచి రైతుకు రక్షణేదీ?

ఎటువంటి విధానాలు అమలు చేస్తే రైతులు స్థిరమైన ఆదాయం పొందుతారనే విషయం పాలకులకు తెలియనిదేమీ కాదు. ఇప్పడు పంట నష్టపోతే వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి కానీ పరిహారం (అసలు వస్తుందన్న గ్యారంటీ లేదు) చేతికందటం లేదు. మన రైతులు పంట చేలో కలుపు మొక్కలు ఏరుతున్నారు కానీ, ఈ దేశ "రాజకీయాలకు పట్టిన చీడల్ని" వదిలించడంపై దృష్టి పెట్టి ఉంటే వారి పరిస్థితులు ఈ పాటికి బాగుపడేవేమో..! ఏమంటారు? పంటల బీమా పథకం లోని లొసుగుల్ని విశ్లేషిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజ ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఆ క్లిప్పింగ్‌....

from జైకిసాన్ http://ift.tt/1DwB98z

విత్తు దశ నుంచే విపత్తు!

ఎటువంటి విధానాలు అమలు చేస్తే రైతులు స్థిరమైన ఆదాయం పొందుతారనే విషయం పాలకులకు తెలియనిదేమీ కాదుఇప్పడు పంట నష్టపోతే వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి కానీ పరిహారం (అసలు వస్తుందన్న గ్యారంటీ లేదుచేతికందటం లేదుమన రైతులు పంట చేలో కలుపు మొక్కలు ఏరుతున్నారు కానీఈ దేశ "రాజకీయాలకు పట్టిన చీడల్నివదిలించడంపై దృష్టి పెట్టి ఉంటే వారి పరిస్థితులు ఈ పాటికి బాగుపడేవేమో..! ఏమంటారుపంటల బీమా పథకం లోని లొసుగుల్ని విశ్లేషిస్తూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజ ఈనాడు ప్రచురించిందిమీ కోసం ఆ క్లిప్పింగ్‌....
                                                            
Wednesday 1 July 2015

ఇజ్రాయెల్‌ వ్యవసాయం పార్ట్‌-2

జూలై నెల అన్నదాత మాసపత్రికలో ఇజ్రాయెల్‌ వ్యవసాయంగంపై నేను పరిశీలించిన అనుభవాల గురించి రాసిన వ్యాసం రెండో భాగం ప్రచురితమైంది. వాటిని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను
                                                                   
from జైకిసాన్ http://ift.tt/1FThKOL

ఇజ్రాయెల్‌ వ్యవసాయం పార్ట్‌-2

జూలై నెల అన్నదాత మాసపత్రికలో ఇజ్రాయెల్‌ వ్యవసాయంగంపై నేను పరిశీలించిన అనుభవాల గురించి రాసిన వ్యాసం రెండో భాగం ప్రచురితమైందివాటిని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను
                                                         
Monday 29 June 2015

బలిపీఠంపై రైతులు

వ్యవస్థాగతంగా వేళ్లూనుకుపోయిన సమస్యల్ని పరిష్కరించకపోవడంతో వ్యవసాయం ఒక దండుగ మారి వ్యాపకంగా మారింది. వరుస నష్టాలు వస్తున్నా ఒకసారి కాకపోతే మరోసారి ఒడ్డునపడతామన్న గుడ్డినమ్మకంతో సేద్యం కొనసాగిస్తున్న వారు కొందరైతే., కొండల్లా పెరిగిన అప్పులు తీర్చే మార్గం లేక ప్రభుత్వాల తోడ్పాటు లేక మరికొందరు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలకు కారణాలు, పరిష్కారాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈనాడు ఈరోజు ప్రచురించింది. ఆ వ్యాసాన్ని మీ కోసం ఇక్కడ అప్‌లోడ్‌ చేస్తున్నాను.
                                                           
from జైకిసాన్ http://ift.tt/1eWHYec

Tuesday 2 June 2015

ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్‌"

వ్యవసాయరంగంలో ఇజ్రాయెల్‌ సాధించిన ప్రగతి గురించి నేను రాసిన ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్‌" మొదటి భాగాన్ని సచిత్రాలతో సవివరంగా ఇచ్చారు. మీ కోసం ఆ క్లిప్సింగ్స్‌... ఈ వ్యాసం రెండో భాగం జూలై సంచికలో.. 
                                                      
from జైకిసాన్ http://ift.tt/1EUwo7T

ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్‌"

వ్యవసాయరంగంలో ఇజ్రాయెల్‌ సాధించిన ప్రగతి గురించి నేను రాసిన ఎడారి సిగలో సిరిమల్లె... "ఇజ్రాయెల్‌" మొదటి భాగాన్ని సచిత్రాలతో సవివరంగా ఇచ్చారు. మీ కోసం ఆ క్లిప్సింగ్స్‌... ఈ వ్యాసం రెండో భాగం జూలై సంచికలో..
                                                             
Thursday 28 May 2015

ఇండో-ఇజ్రాయెల్‌ల వ్యవసాయం-వ్యత్యాసాలు

అవసరమైనది దొరకనప్పుడు అదే మనకు ప్రియం అవుతుందిఇజ్రాయెల్‌కు లేనిది నీరుఅదే అక్కడ అపురూపంఅపురూపమైన నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి చుక్కనీరు వృథా కాకుండా సమర్ధంగా వాడుకున్నారుజాతిగా తమకున్న అపార మేథోశక్తిని ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారువాటి సాయంతో ఊహకందని ఫలితాలను రాబట్టుకున్నారుఏదీ దొరకని చోట అన్నీ దొరికేలా చేసుకున్నారుఅన్నీ ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా నిలిచారునా ఇజ్రాయెల్‌ పర్యటనలో చూసిన అనుభవాలతో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు రాజకీయాలు మన రైతులకెంత శాపంగా పరిణమించాయో నాకు అర్ధమైందిఈ రెండు దేశాలకూ ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదేమిగతావన్నీ దీని తర్వాతే

భారత్ తో పోల్చితే  ఇజ్రాయెల్ వ్యవసాయంలో ఉన్నదీ మనకు లేనిదీ., రెండు దేశాల మధ్య ఉన్న సారూప్యాలు, వ్యావసాయకంగా ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను
                                                                                 
from జైకిసాన్ http://ift.tt/1FRaCHs

యంత్రంతో మంత్రం!

అవసరమైనది దొరకనప్పుడు అదే మనకు ప్రియం అవుతుంది. ఇజ్రాయెల్‌కు లేనిది నీరు. అదే అక్కడ అపురూపం. అపురూపమైన నీటిని బొట్టు బొట్టు లెక్కకట్టి చుక్కనీరు వృథా కాకుండా సమర్ధంగా వాడుకున్నారు. జాతిగా తమకున్న అపార మేథోశక్తిని ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. వాటి సాయంతో ఊహకందని ఫలితాలను రాబట్టుకున్నారు. ఏదీ దొరకని చోట అన్నీ దొరికేలా చేసుకున్నారు. అన్నీ ఉన్న దేశాలకూ స్ఫూర్తిగా నిలిచారునా ఇజ్రాయెల్‌ పర్యటనలో చూసిన అనుభవాలతో రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించినప్పుడు రాజకీయాలు మన రైతులకెంత శాపంగా పరిణమించాయో నాకు అర్ధమైంది. ఈ రెండు దేశాలకూ ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే. మిగతావన్నీ దీని తర్వాతే.
 
భారత్ తో పోల్చితే  ఇజ్రాయెల్ వ్యవసాయంలో ఉన్నదీ మనకు లేనిదీ., రెండు దేశాల మధ్య ఉన్న సారూప్యాలు, వ్యావసాయకంగా ఉన్న వ్యత్యాసాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. మీ కోసం ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను.