Friday 16 March 2012

వ్యవసాయాన్ని విస్మరించిన బడ్జెట్!

                                                          
కేంద్ర విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ నేడు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్ సబ్సిడీల కోత పనుల మోత చందంగా ఉంది. ఆహార భద్రతకు పూర్తీ రాయితీలంటూనే ఇతర సబ్సిడీలకు కోత పెట్టారు. వ్యవసాయ సంస్కరణల ఊసే లేకుండా ఉన్న ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. రైతులకు ఎరువుల సబ్సిడీని సైతం నగదు రూపంలో అందజేయనున్నట్టు స్పష్టం చేసారు. వ్యవసాయ ఉత్పతుల మద్దతు ధరల స్థిరీకరణ నిధికి నిధులు కేటాయించడాన్ని విస్మరించారు. లక్ష కోట్ల పంట రుణాలను పెంచినప్పటికీ, నేటికీ రైతులకు ఇస్తున్నరుణాలు నూటికి  30 శాతానికి దాటలేదన్న సంగతిని సర్కారు గుర్తించాలి. అలానే మార్కెట్ సంస్కరణలు, పరిశోధనా, విస్తరణకు ఆశించిన రీతిలో పెట్టుబడులు కేటాయించలేదు. మెత్తంగా అన్ని వర్గాలపై పన్నుల భారం మోపిన ప్రణబ్ బడ్జెట్ కీలకమైన వ్యవసాయాన్ని విస్మరించి రైతులోకానికి తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.

2 comments:

Anonymous said...

మాస్టారూ...
మీ బ్లాగ్‌లు చూస్తున్నాను. చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెబుతున్న తీరు బాగుంటోంది.
మీ ఫణీంద్ర, ఈటీవీ2

Hari Krishna said...

సోదరా
నా బ్లాగ్ ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. కాస్త సమయం చిక్కినప్పుడల్లా పోస్ట్ చేస్తున్నాను. మీకు కుదిరినప్పుడల్లా చూస్తూ ఉండండి.
మీ
హరికృష్ణ