Thursday 29 March 2012

సైన్యంలో తెగే తల ఎవరిది?

                                                 
సైన్యంలో మందుగుండు కొరత తీవ్రంగా ఉందని., వైమానిక రక్షణ వ్యవస్థకు కాలం చెల్లి పోయిందని, కేంద్రం నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదంటూ ప్రధాని మన్మోహన్ కు ఆర్మీ జనరల్ వీకే సింగ్ రాసిన లేఖ దేశం పరువును బజారుకు ఈడ్చినట్లయ్యింది. పదవీ విరమణ విషయంలో మాట నెగ్గించుకోలేకపోయిన సింగ్, చివరికి రక్షణ వ్యవస్థను వీధిన పడేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నేట్టారనే చెప్పాలి.   అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారంలో జనరల్ సింగ్ తలకాయ తెగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా దేశ భద్రతకు కీలకమైన రక్షణ వ్యవస్థ నేడు వివాదాలకు కేంద్ర బిందువవడం మనం చేసుకున్న దురదృష్టం.

2 comments:

పూర్ణప్రజ్ఞాభారతి said...

హరికృష్ణగారూ,
వ్యవసాయేతరం అయిన అంశాన్ని మీ బ్లాగులో తొలిసారి చదివా. బాగుంది. తక్కువ వాక్యాలలో సీరియస్ అంశాన్ని ప్రస్తావించడం ఓ కళ. మీరు అందులో మాస్టరీ సాధించారు. అభినందనలు.

అమిర్నేని హరికృష్ణ said...

ప్రజ్ఞా భారతి గారు
ధన్యవాదాలు సర్. వ్యవసాయం పైనే నా దృష్టి. ఇది.., దేశ రక్షణ విషయంలో వీళ్ళ నిర్లిప్తత చూసి ఆవేదన చెంది రాశానంతే.