Tuesday, 7 December 2021
సేద్యంలో అంకురిస్తున్న సాంకేతిక విప్లవం
సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ సాగుకు మరిన్ని నగిషీలు చెక్కుతూ అంకుర సంస్ధలు ఎన్నో వ్యవసాయానికి సరికొత్త హంగులు కల్పిస్తున్నాయి. అయితే ఈ సరికొత్త సాంకేతికతో గ్రామీణ బడుగు రైతుల్ని అనుసంధానించడమే నేడు దేశం ముందున్న పెద్ద సవాలంటూ నేను రాసిన వ్యాసాన్ని డిసెంబరు 2021 " అన్నదాత" సంచిక ప్రచురించింది.
from జైకిసాన్ https://ift.tt/3rIQZ2M
Thursday, 2 December 2021
Monday, 22 November 2021
సస్య విప్లవం సాకారం కావాలంటే.. !
నూతన సాగు సవాళ్ళను అందుకునే దిశగా సస్య శాస్త్ర పరిశోధనలు మరింత పదును తేలాల్సిన అవసరం ఉందంటూ నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది. ప్రో. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఆగ్రానమి కాంగ్రెస్ కు తొలిసారిగా ఆతిధ్యం ఇస్తోంది. నేటి నుంచి ఈ సదస్సు ప్రారంభం కానుంది.
from జైకిసాన్ https://ift.tt/3nHuYz7
Thursday, 18 November 2021
ఇది రైతుల విజయం
అన్నదాతల కృషి ఫలించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న రైతుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు కాసేపటి కిందట కేంద్రం ప్రకటించడంపై దేశ వ్యాప్తంగా రైతులోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది రైతుల విజయం.
from జైకిసాన్ https://ift.tt/3FyRfoX
Wednesday, 3 November 2021
దీపావళి శుభాకాంక్షలు.
🪔✨కష్టాల చీకట్లను తొలగించి ఈ దీపావళి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ✨🪔
from జైకిసాన్ https://ift.tt/3CN1FA9
సంఘటితమైతేనే సత్ఫలితాలు
సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుని లాభసాటి సేద్యం చేయాలంటే ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న విధానాలకు ఆధునికతను జోడించాలి. రైతులు ఒక్కరుగా కంటే సమష్టిగా సంఘటితంగా ఏర్పడితేనే ఇది సాధ్యం. ఉత్పత్తిదారుల సంఘాలుగా రైతులు ఏర్పడి సమష్టిగా ముందుకు సాగితే వచ్చే ప్రయోజనాలతో పాటు నాబార్డు వాటికి అందిస్తున్న చేయూతపై నేను రాసిన వ్యాసం నవంబరు 2021 అన్నదాత సంచికలో ప్రచురితమైంది.
from జైకిసాన్ https://ift.tt/3waJfqB
Sunday, 31 October 2021
Friday, 29 October 2021
అన్నదాత ప్రత్యేక సంచిక
నవంబర్ 23 నుంచి హైదరాబాద్ లోని ప్రో.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ. విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఆగ్రానమి కాంగ్రెస్ కు తొలిసారిగా వేదిక కానుంది. ఈ సందర్భంగా "అన్నదాత "ప్రత్యేక సంచికను వెలువరించింది. ఒక అంతర్జాతీయ సదస్సుకు అన్నదాత ప్రత్యేక సంచికను తీసుకురావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా వర్సిటీలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డా. ప్రవీణ్ రావ్ ఈ ప్రత్యేక సంచికను విడుదల చేశారు.
from జైకిసాన్ https://ift.tt/2ZzzTsa
Thursday, 14 October 2021
విజయ దశమి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
-అమిర్నేని హరికృష్ణ
from జైకిసాన్ https://ift.tt/3lFGsCc
Tuesday, 5 October 2021
సేద్యరంగం భళా.. సాగుదార్లు డీలా!
మన దేశం వ్యవసాయకంగా ఎంతో పురోగమించింది కానీ సాగుదార్లు మాత్రం నేటికీ సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. దీనిపై నేను రాసిన వ్యాసం అన్నదాత అక్టోబరు 2021 సంచికలో ప్రచురితమైంది.
from జైకిసాన్ https://ift.tt/2WLfYWh
Thursday, 30 September 2021
Thursday, 9 September 2021
Sunday, 5 September 2021
వ్యర్ధాలకు కొత్త అర్ధం "బయోగ్యాస్"
పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో డీజిలుకు ప్రత్యామ్నాయంగా బయోగ్యాస్ ను ఉపయోగించి సిబిజి, సిఎన్ జి తయారీ నేడు ఉపందుకుంటోంది. వీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్లకు సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ రాయితీలు అందిస్తోంది. రైతు స్థాయి నుంచి డీజిల్ ఉత్పత్తి వరకు వ్యర్ధాలకు కొత్త అర్ధం చెప్పే బయోగ్యాస్ ఉపయోగాల గురించి నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు ఈనాడు ప్రచురించింది.
from జైకిసాన్ https://ift.tt/3DPEFBo
Friday, 3 September 2021
ధీమా ఇవ్వని పంటల బీమా
కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా పధకాన్ని తెలుగు రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదు. వాటాల విషయంలో పట్టు విడుపులకు పోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేయాల్సిన పధకం ఇలా నీరుగారుతుండటం వల్ల విపత్తులు సంభవించినప్పుడల్లా రైతులకు బీమా ధీమా కల్పించలేకపోతోంది. ఈ అంశంపై సెప్టెంబరు అన్నదాత మాసపత్రికలో ప్రచురితమైన నా వ్యాసమిది.
from జైకిసాన్ https://ift.tt/3tgfanS
Thursday, 2 September 2021
Saturday, 7 August 2021
కుండీలను మార్చుకోవడం తప్పనిసరి
మొక్కలు ఒక దశ వరకు పెరిగాక వేర్లు విస్తరిస్తాయి కాబట్టి కుండీలను మార్చుకోవడం తప్పనిసరి. ఇంటిపంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న 18 వ భాగం లో రీపాటింగ్ గురించి.
from జైకిసాన్ https://ift.tt/3s1IDS6
Friday, 6 August 2021
కషాయాల తయారీ
చీడపీడల నివారణకు రసాయనాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో కషాయాలను తయారు చేసి వినియోగించడం వల్ల మంచి ప్రయోజనాలు దక్కుతాయి. ఇంటి పంట శీర్షికలో భాగంగా ఈనాడులో అందిస్తున్న 17వ భాగం ....
from జైకిసాన్ https://ift.tt/37pcavk
Thursday, 5 August 2021
ట్రెల్లిసింగ్ పద్ధతిలో కూరగాయల పెంపకం
టొమాటో వంటి కూరగాయ మొక్కల్ని నేలపై పరచుకునేలా కాకుండా కర్రలు పాతి ఎత్తుకు పెరిగేలా తాళ్లతో కడుతూ పెంచితే అధిక దిగుబడులు వస్తాయి. ట్రెల్లిసింగ్ పద్ధతిగా వ్యవహరించే ఈ విధానం గురించి ఇంటి పంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న 16వ భాగం నేడు.
from జైకిసాన్ https://ift.tt/3jJ50YX
Wednesday, 4 August 2021
పెరట్లో పండ్ల మొక్కల పెంపకం
కొన్ని రకాల పండ్ల మొక్కలను మిద్దె/పెరటిలోనే పెంచుకోవడం ద్వారా రసాయనాలు వాడని పండ్లను పొందే అవకాశం ఉంటుంది. ఈ వివరాల గురించి ఈ రోజు ఈనాడులో ఇంటి పంట శీర్షికన అందిస్తున్న
15 వ భాగం.
from జైకిసాన్ https://ift.tt/3AdJ7aw
Tuesday, 3 August 2021
ఉత్పాదకత పెంచే వ్యూహాలేవి?
పలు పంటల సాగులో ఉత్పత్తి అధికంగా ఉంటున్నా సగటు ఉత్పాదకత లో ఆశించిన పెరుగుదల నమోదు కావడం లేదు. ఉత్పాదకత పెంచే వ్యూహాలపై నేను రాసిన వ్యాసం అన్నదాత మాసపత్రిక ఆగస్టు 2021 సంచికలో ప్రచురితమైంది.
from జైకిసాన్ https://ift.tt/3CdVgy9
హైడ్రోపోనిక్స్ సాగు
మట్టి అవసరం లేకుండా పరిమిత నీటితో పంటలు పండించుకునే హైడ్రోపోనిక్స్ కు నేడెంతో ప్రాచుర్యం లభిస్తోంది. ఇంటికి కావలసిన ఆకుకూరలను ఒక చిన్న స్టాండ్ లో పెంచుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇలాంటి పరికరాలను హైదరాబాద్ లోనూ విక్రయిస్తున్నారు. ఇంటి పంట శీర్షికన ఈనాడులో ఇస్తున్న సిరీస్ లో ఇది 14వ భాగం. హైడ్రోపోనిక్స్ వివరాలను ఇక్కడ చూడవచ్చు.
from జైకిసాన్ https://ift.tt/3yrsAPS
Sunday, 1 August 2021
సస్యరక్షణకు సహజ పద్ధతులు
ఇంటి పంట సాగు చేసుకునే వారు మొక్కలకు చీడపీడలు ఆశిస్తే ఏం చేయాలన్న సందేహాలతో ఇబ్బందులు పడుతుంటారు. సస్యరక్షణ కోసం రసాయన చల్లే కంటే వృక్ష సంబంధిత, గోఆధారిత పదార్ధాలను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈనాడులో ఇంటి పంట శీర్షిక 13వ భాగంలో ఈ వివరాలు చూడవచ్చు.
from జైకిసాన్ https://ift.tt/3lhyQWJ